హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్బరుద్దీన్ డబుల్ హ్యాట్రిక్ ఫిక్స్!

హైదరాబాద్ పాతబస్తీ అంటే అందరికీ ఒవైసీ బ్రదర్స్, ఎం‌ఐ‌ఎం పార్టీనే గుర్తు వస్తుందని చెప్పొచ్చు...ఎందుకంటే మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్న పాతబస్తీలో మరొక పార్టీ గెలవడానికి ఏ మాత్రం అవకాశం లేదు..పాతబస్తీలో ఉన్న దాదాపు 7 సీట్లు ఎం‌ఐ‌ఎం వశం అవ్వాల్సిందే...ఆ ఏడు నియోజకవర్గాలు ఎం‌ఐ‌ఎంకు కంచుకోటలు. ఇక ఆ ఏడు స్థానాల్లో చాంద్రాయణగుట్ట గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.


ఈ స్థానం పూర్తిగా ఎం‌ఐ‌ఎం కంచుకోట..ఇక్కడ వేరే పార్టీ గెలుపు ఊహించడానికి లేదు..అసలు ఇక్కడ అక్బరుద్దీన్ ఒవైసీకి చెక్ పెట్టడం జరిగే పని కాదు...గత ఐదు ఎన్నికల్లో ఇక్కడ ఒవైసీని ఎవరు ఓడించలేకపోతున్నారు. 1999 ఎన్నికల్లో తొలిసారి చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేసి అక్బరుద్దీన్ విజయం సాధించారు. ఇక అక్కడ నుంచి ఒవైసీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2004లో రెండోసారి...2009లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.
అలాగే రాష్ట్రం విడిపోయాక జరిగిన 2014 ఎన్నికల్లో మరొకసారి విజయం సాధించారు...ఇక 2018 ఎన్నికల్లో అక్బరుద్దీన్ విజయానికి ఢోకా లేకుండా పోయింది...దాదాపు 80 వేల ఓట్ల భారీ మెజారిటీతో బీజేపీపై గెలిచారు. ఇంకా చెప్పాలంటే ప్రత్యర్ధులకు డిపాజిట్లు రాకుండా ఓడించారు..ఇలా భారీ విజయంతో ఐదోసారి విజయం సాధించారు...ఇక ఎమ్మెల్యేగా ఒవైసీ పనితీరు గురించి చెప్పాల్సిన పని లేదు...ఇటు టీఆర్ఎస్ తో సఖ్యతతో ఉండటంతో అభివృద్ధి కూడా బాగానే జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే అక్కడ ఏం జరిగినా, జరగకపోయినా చాంద్రాయణగుట్ట ప్రజలు ఎం‌ఐ‌ఎంని దాటి మరొక పార్టీని గెలిపించడం జరిగే పని కాదు.
రాజకీయంగా ఇక్కడ ఒవైసీకు చెక్ పెట్టే వారు లేరు...అయితే బీజేపీ కొద్దో గొప్పో ఒవైసీని నిలువరించాలని చూస్తుంది. ఇటీవల తెలంగాణలో బీజేపీ బాగా పికప్ అవుతున్న విషయం తెలిసిందే..టీఆర్ఎస్ తో పాటు ఎం‌ఐ‌ఎంకు కూడా చెక్ పెట్టాలని చూస్తుంది. కానీ ఎం‌ఐ‌ఎంకు చెక్ పెట్టడం బీజేపీకి సాధ్యం కాదు. ఒకవేళ గుట్టలో ఒవైసీ మెజారిటీ కాస్త తగ్గించగలుతుందేమో గాని...ఆయన డబుల్ హ్యాట్రిక్ ఆపడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

mim

సంబంధిత వార్తలు: