హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రాజాసింగ్‌కు హ్యాట్రిక్ ఛాన్స్ ఉందా?

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు వివాదాల్లో ఉండే నాయకుల్లో రాజాసింగ్ కూడా ఒకరని చెప్పొచ్చు...అసలు రాజాసింగ్ ఎన్ని వివాదాల్లో ఉన్నారో చెప్పాల్సిన పని లేదు...ఎప్పటికప్పుడు ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తూనే ఉంటారు...అలాగే హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్లే రాజాసింగ్...ఎం‌ఐ‌ఎం పార్టీతో ఎలాంటి కయ్యం పెట్టుకుంటారో తెలిసిందే. తాజాగా కూడా ఉత్తరప్రదేశ్‌లో యోగికి ఓటు వేయని వారిపైకి జేసీబీలు పంపుతామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇక ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజాసింగ్‌కు కొత్తేమీ కాదని చెప్పొచ్చు..ఇలా ఎప్పుడు వివాదాల్లో ఉండే రాజాసింగ్...వరుసపెట్టి గోషామహల్ నియోజకవర్గంలో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే..అసలు ఇప్పుడు బీజేపీలో కీలక నేతగా మారిన రాజాసింగ్ రాజకీయ జీవితం మొదలైంది టీడీపీలో...2009లో జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో టీడీపీ తరుపున కార్పొరేటర్‌గా పనిచేశారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీలు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే..ఈ క్రమంలో రాజాసింగ్ గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దాదాపు 46 వేల ఓట్ల భారీ మెజారిటీతో రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇక ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా తనదైన శైలిలో పనిచేసుకుంటూ వచ్చారు...2018 ముందస్తు ఎన్నికలోచ్చేసరికి రాజాసింగ్ మరొకసారి గోషామహల్ నుంచి బీజేపీ తరుపున పోటీ చేశారు. అసలు రాష్ట్రంలో బీజేపీ నేతలంతా దారుణంగా ఓడిపోతే...ఒక్క రాజాసింగ్ మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. టీఆర్ఎస్‌పై 17 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు...అలా గెలిచాక రాజాసింగ్ ఎలాంటి రాజకీయం చేస్తున్నారో అందరికీ తెలిసిందే.
అయితే నార్త్ నుంచి వచ్చిన రాజాసింగ్‌కు గోషామహల్‌లోని నార్త్ ఓటర్లే బాగా అండగా ఉంటున్నారు..వారే రాజాసింగ్‌కు ప్లస్. అందుకే అక్కడ రాజాసింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు..ఇక్కడ టీఆర్ఎస్ పికప్ అవ్వాలని చూస్తుంది గాని...రాజాసింగ్‌ని డామినేట్ చేసేలా ముందుకెళ్లలేకపోతుంది..ఇక్కడ కాంగ్రెస్‌కు కాస్త పట్టు తగ్గిందనే చెప్పొచ్చు. మొత్తానికి గోషామహల్‌లో రాజాసింగ్ మరోసారి సత్తా చాటేలా ఉన్నారు...మరి చూడాలి రాజాసింగ్ హ్యాట్రిక్ కొత్తకుండా టీఆర్ఎస్ ఆపుతుందో లేదో.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: