హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ గులాబీ ఎమ్మెల్యే తగ్గేదేలే!

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అధికార టీఆర్ఎస్ హవా ఉన్న విషయం తెలిసిందే...ఒకప్పుడు ఈ జిల్లాలో టీడీపీ హవా ఉండేది...కానీ టీడీపీకి చెందిన నాయకులని, కార్యకర్తలని టీఆర్ఎస్ వైపుకు లాగేసుకున్నారు..దీంతో రంగారెడ్డిలో టీఆర్ఎస్ తిరుగులేని పొజిషన్‌లో ఉంది..గత ఎన్నికల్లో రంగారెడ్డిలో టీఆర్ఎస్ అద్భుత విజయాలనే అందుకుంది. ఇదే క్రమంలో పరిగి నియోజకవర్గంలో కూడా తొలిసారి టీఆర్ఎస్ విజయం సాధించింది. 2001లోనే టీఆర్ఎస్ ఆవిర్భవించిన సరే..పరిగిలో 2018 వరకు గెలవలేదు.
మొదట్లో ఇక్కడ టీడీపీ హవా ఉండేది...టీడీపీ నుంచి కొప్పుల హరీశ్వర్ రెడ్డి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు..1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో అయిదుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే తెలంగాణ ఉద్యమం మరింత ఉదృతం అవుతున్న సమయంలో హరీశ్వర్ రెడ్డి టీడీపీని వదిలి టీఆర్ఎస్‌లోకి వచ్చేశారు. ఇక తెలంగాణ వచ్చాక ఈయన టీఆర్ఎస్ నుంచి పరిగి బరిలో దిగారు..కానీ అనూహ్యంగా కాంగ్రెస్ నేత టి.రామ్మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
అయితే తర్వాత హరీశ్వర్ రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో టీఆర్ఎస్ అధిష్టానం...హరీశ్వర్ తనయుడు మహేశ్ రెడ్డికి పరిగి సీటు ఇచ్చారు...2018 ఎన్నికల్లో మహేశ్ పోటీ చేసి...కాంగ్రెస్‌పై విజయం సాధించారు. దాదాపు 16 వేల ఓట్ల మెజారిటీతో మహేశ్ గెలిచారు..తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సరే పరిగిలో దూకుడుగానే రాజకీయం చేస్తున్నారు...ప్రజలకు అందుబాటులో ఉంటూ..వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారులతో మాట్లాడి పనిచేస్తున్నారు...మంత్రి కేటీఆర్ సహకారంతో పరిగి మున్సిపాలిటీని మంచిగా అభివృద్ధి చేసుకుంటున్నారు. అయితే నియోజకవర్గంలో డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా మెరుగుపడాలి...తాగునీటి సమస్యలు ఉన్నాయి..కొన్ని ప్రాంతాల్లో రోడ్ల సౌకర్యం అంతంత మాత్రమే ఉంది.
రాజకీయంగా చూస్తే పరిగిలో మహేశ్ రెడ్డి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు..పైగా ఎన్నో ఏళ్లుగా తన తండ్రికి ఉన్న ఫాలోయింగ్ మహేశ్‌కు కలిసొస్తుంది..అటు కాంగ్రెస్ నేత రామ్మోహన్ రెడ్డి యాక్టివ్‌గానే పనిచేస్తున్నారు...ఇక్కడ బీజేపీకి పెద్ద బలం లేదు...అయితే పరిగిలో మహేశ్ రెడ్డి హవానే ఎక్కువ కనిపిస్తోంది..మళ్ళీ ఇంకోసారి గెలిచిన ఆశ్చర్యపోనవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: