హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ కారు ఎమ్మెల్యేకు నాల్గవ ఛాన్స్?

తెలంగాణలో అధికారంలో టీఆర్ఎస్ పార్టీలో చాలామంది మాజీ తమ్ముళ్ళు ఉన్న విషయం తెలిసిందే..అంటే టీఆర్ఎస్‌లో సగం పైనే నాయకులు టీడీపీ నుంచి వచ్చిన వారే..తెలంగాణలో టీడీపీ పరిస్తితి కనుమరుగవ్వడంతో..ఆ పార్టీ నేతలంతా టీఆర్ఎస్‌లోకి వచ్చేసిన విషయం తెలిసిందే. మెజారిటీ నేతలు టీఆర్ఎస్‌లోకి రాగా, కొందరు కాంగ్రెస్, మరికొందరు బీజేపీలో చేరారు.
కానీ టీఆర్ఎస్‌లో సగం మంది టీడీపీ వాళ్లే..అలా టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన వారిలో టి. ప్రకాశ్ గౌడ్ కూడా ఒకరు..ప్రకాశ్ రాజకీయ జీవితం మొదలైంది టీడీపీలో..2009 ఎన్నికల్లో ఈయన తొలిసారి టీడీపీ నుంచి బరిలో దిగి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దాదాపు 7 వేల ఓట్ల మెజారిటీతో ప్రకాశ్ గెలిచారు. ఇక తెలంగాణ వచ్చాక కూడా ఈయన టీడీపీ నుంచే బరిలో దిగారు...2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి 25 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక చంద్రబాబు ఏపీకే పరిమితం కావడం, తెలంగాణలో టీడీపీ పరిస్తితి రోజురోజుకూ దిగజారిపోతుండటంతో ప్రకాశ్ తప్పనిసరి పరిస్తితుల్లో టీడీపీని వదిలి టీఆర్ఎస్‌లో చేరారు.
ఈ క్రమంలోనే 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి రాజేంద్రనగర్ బరిలో దాదాపు 58 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. అది కూడా టీడీపీపైనే ఈయన గెలిచారు. ఇలా వరుసగా విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టారు. అలాగే మూడు సార్లు ఎమ్మెల్యే కావడంతో రాజేంద్రనగర్‌పై ఈయనకు బాగా పట్టు ఉంది...అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగానే చేస్తున్నారు.
అవుటర్ రింగ్ రోడ్డు దగ్గరలో ఉన్న ఈ నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకెళుతుంది..ఇక్కడ మెరుగైన రోడ్లు, డ్రైనేజ్ వసతి కల్పించారు. తాగునీటి సమస్యలు లేకుండా చూసుకుంటున్నారు. రాజకీయంగా చూస్తే ఇక్కడ ప్రకాశ్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు...టీడీపీ చాప్టర్ క్లోజ్ అయింది..కాంగ్రెస్, బీజేపీలు బలపడటానికి చూస్తున్నాయి. ఇక్కడ ఎం‌ఐ‌ఎంకి కూడా బలం ఉంది. మొత్తానికి మాత్రం రాజేంద్రనగర్‌లో ప్రకాశ్ నాల్గవ సారి కూడా గెలిచేలా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: