హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ కారు ఎమ్మెల్యేకు హ్యాట్రిక్ ఛాన్స్?

తెలంగాణ వచ్చాక చాలామంది టీఆర్ఎస్ నేతలకు లక్కీ ఛాన్స్ దొరికిందని చెప్పొచ్చు..టీఆర్ఎస్ వేవ్‌లో చాలామంది నేతలు వరుసపెట్టి విజయాలు సాధించేస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధిస్తున్న నేతల్లో గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఒకరు. మహిపాల్ రెడ్డి..1991లో రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. ట్రేడ్ యూనియన్ లీడర్‌గా పనిచేశారు. అలాగే 1995లో పటాన్‌చెరు ఎంపీటీసీగా గెలిచారు. ఇలా ఇండిపెండెంట్‌గా రాజకీయం చేస్తూ వస్తున్న మహిపాల్...2009లో బీఎస్పీలో చేరారు.
అక్కడ కూడా రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మహిపాల్..అనూహ్యంగా టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్‌లో చేరి 2014 ఎన్నికల్లో పటాన్‌చెరు ఎమ్మెల్యేగా గెలిచారు....అలాగే 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా మహిపాల్ టీఆర్ఎస్ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇలా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్...తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు....పటాన్‌చెరు ఎలాగో హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండటంతో...ఇక్కడ అభివృద్ధి వేగంగా జరిగింది. అలాగే పారిశ్రామిక వాడగా పటాన్‌చెరు ఉంది.
అయితే పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ కాలుష్యం ఎక్కువగా ఉంది...అలాగే కాలుష్యం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే చాలా వరకు కాలుష్య కోరల్లో చిక్కుకున్న గ్రామాలకు ఉచితంగా మంచినీటిని అందిస్తున్నారు. ఇక నియోజకవర్గ శివారుల్లో సరైన రోడ్ల వసతి కల్పించాల్సిన అవసరం కూడా ఉంది.
రాజకీయంగా చూస్తే గతంలో పటాన్‌చెరులో కాంగ్రెస్ బలంగా ఉండేది...కానీ తెలంగాణ వచ్చాక ఇక్కడ టీఆర్ఎస్ హవా నడుస్తోంది. అన్నీ ప్రాంతాల ప్రజలు కలిసి ఉండే ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. అయితే తిరిగి పుంజుకోవడానికి కాంగ్రెస్ ట్రై చేస్తుంది. కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ దూకుడుగానే పనిచేస్తున్నారు..ఈ సారి ఎలాగైనా పటాన్‌చెరులో గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇక్కడ బీజేపీ బలం కూడా పెరిగింది..నెక్స్ట్ ఎన్నికల్లో త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది. మరి ఈ ట్రైయాంగిల్ పోరులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు కూడా లేకపోలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: