హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పద్మాపై రాములమ్మ పోటీ?

తెలంగాణ రాజకీయాల్లో పవర్‌ఫుల్ మహిళా నేతల్లో పద్మా దేవేందర్ రెడ్డి కూడా ఒకరని చెప్పొచ్చు..దాదాపు రెండు దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న పద్మా...రాజకీయంగా మంచి విజయాలు కూడా అందుకున్నారు. ఇన్నేళ్లు రాజకీయం చేస్తూ..రాజకీయంగా సక్సెస్ అవ్వడం కూడా గొప్ప విషయమనే చెప్పాలి. 2001లో రాజకీయాల్లోకి వచ్చిన పద్మా..అప్పుడు పరిషత్ ఎన్నికల్లో రామాయంపేట జెడ్పీటీసీగా గెలిచారు.
ఇక 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి రామాయంపేట(నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల్లో పద్మా ఓటమి పాలయ్యారు. అయితే కొన్ని కారణాల వల్ల 2009లో టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు...మళ్ళీ 2010లో ఆమె పార్టీలో చేరారు. తెలంగాణ వచ్చాక జరిగిన 2014 ఎన్నికల్లో పద్మా..టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మెదక్ అసెంబ్లీలో విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన విజయశాంతిపై ఆమె గెలిచారు.
అలాగే తెలంగాణ తొలి డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు..2018 ముందస్తు ఎన్నికల్లో మరొకసారి పద్మా ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా ఎమ్మెల్యేగా గెలిచిన పద్మా..మెదక్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మెదక్‌లో సి‌సి రోడ్లు, అండర్ డ్రైనేజ్‌ల నిర్మాణాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, వాటర్ ట్యాంక్‌లు, రైతు బజార్ల నిర్మాణాలు జరిగాయి. మెదక్ నగరంలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే పద్మా ముందు ఉన్నారు.
మెదక్‌లో రాజకీయ పరంగా పద్మా స్ట్రాంగ్‌గానే ఉన్నారు...కాకపోతే ఇక్కడ సరైన ప్రత్యర్ధి ఉంటే పద్మాకు రాజకీయంగా గట్టి పోటీ ఎదురవుతుంది..2014లో పోటీ చేసిన విజయశాంతి..మళ్ళీ మెదక్ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది..ఇప్పటికే ఆమె బీజేపీలో దూకుడుగా ఉన్నారు..అలాగే రాష్ట్రంలో బీజేపీ బలం కూడా పెరుగుతుంది. అటు మెదక్‌లో కాంగ్రెస్ కూడా అంత బలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఒకవేళ బీజేపీ నుంచి విజయశాంతి పోటీకి దిగితే పద్మాకు గట్టి పోటీ ఎదురవుతుంది...లేదంటే మళ్ళీ ఆమెకే గెలిచే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: