హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: క్రాంతికి బాబూమోహన్‌తో రిస్కేనా!

తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహా, బాబూమోహన్‌లు చిరకాల ప్రత్యర్ధులనే సంగతి తెలిసిందే. అనేక ఏళ్ళు వీరు ఆందోల్ నియోజకవర్గంలో ప్రత్యర్ధులుగా తలపడుతూ వస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి దామోదర, టీడీపీ నుంచి బాబూమోహన్‌లు పలుమార్లు తలపడ్డారు. కొన్నిసార్లు దామోదర గెలవగా, కొన్ని సార్లు బాబూమోహన్ గెలిచారు.
ఇక 2014 ఎన్నికలోచ్చేసరికి దామోదర యథావిధిగా కాంగ్రెస్ నుంచే పోటీ చేయగా, బాబూమోహన్ టీఆర్ఎస్‌లోకి వచ్చి పోటీ చేశారు. అప్పుడు బాబూమోహన్ విజయం సాధించారు. అయితే 2018 ముందస్తు ఎన్నికలోచ్చేసరికి బాబూమోహన్‌కు టీఆర్ఎస్‌లో టిక్కెట్ దక్కలేదు. టీఆర్ఎస్ టిక్కెట్ క్రాంతి కిరణ్‌కు దక్కింది. దీంతో బాబూమోహన్ బీజేపీలోకి వెళ్ళి పోటీ చేశారు. ఇటు దామోదర కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు.
అయితే ఈ పోరులో దామోదరపై క్రాంతి 17 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక బీజేపీ నుంచి పోటీ చేసిన బాబూమోహన్‌కు కేవలం 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇలా ఇద్దరు సీనియర్లని ఓడించిన క్రాంతి ఎమ్మెల్యేగా పర్వాలేదనిపిస్తున్నారు...ఆందోల్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో పలు సమస్యలు కూడా ఉన్నాయి..ఆందోల్‌లో రోడ్ల పరిస్తితి మరీ దారుణంగా ఉన్నాయి...అటు సింగూరు ప్రాజెక్టు అప్రోచ్‌‌ రోడ్లు, రేలింగ్ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి..అలాగే రూరల్ గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఉన్నాయి.
రాజకీయంగా చూస్తే తొలిసారి ఎమ్మెల్యే అయిన క్రాంతి అనుకున్న స్థాయిలో బలం పెంచుకోలేదనే చెప్పాలి. ఈ మూడేళ్ళలో ఆందోల్‌పై ఆయనకు పెద్దగా పట్టు దొరకలేదు. అటు కాంగ్రెస్ సీనియర్ దామోదర ఆందోల్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. వరుసగా ఓడిపోతున్న సానుభూతి దామోదరపై ఉంది. ఈ సారి ప్రజల మద్ధతు దామోదరకు ఉండేలా ఉంది. అటు బీజేపీ నేత బాబూమోహన్ కూడా  పికప్ అవుతున్నారు. ఈ సారి బాబూమోహన్ కూడా ఆందోల్‌లో సత్తా చాటేలా ఉన్నారు. మొత్తానికి ఆందోల్‌లో త్రిముఖ పోరు జరిగేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: