హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ కారు ఎమ్మెల్యేకు కమలంతో రిస్కే?

తెలంగాణలో బీజేపీ రాజకీయంగా బలపడుతున్న విషయం తెలిసిందే...గత ఎన్నికల వరకు ఒక సీటు గెలుచుకోవడానికే నానా కష్టాలు పడిన బీజేపీ..ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ని వరుసగా ఉపఎన్నికల్లో చిత్తు చేస్తూ వస్తుంది. అనూహ్యంగా ఉపఎన్నికల్లో గెలిచి...టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తుంది. ఇక రాజకీయంగా కూడా కారుపై కమలం యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ప్రతి నియోజకవర్గంలో కారుకు ధీటుగా ఎదగడానికి కమలం ప్రయత్నిస్తుంది. అలాగే కొన్ని చోట్ల టీఆర్ఎస్‌తో పోటీగా బీజేపీ ఎదుగుతుంది.
ఈ క్రమంలోనే నర్సంపేట నియోజకవర్గంలో సైతం బీజేపీ పుంజుకుంటుంది. మొన్నటివరకు ఇక్కడ కాంగ్రెస్-టీఆర్ఎస్‌ల మధ్యే పోరు నడుస్తోంది. ఇప్పుడు బీజేపీ రేసులోకి వస్తుంది. తెలంగాణ వచ్చాక జరిగిన 2014 ఎన్నికల్లో నర్సంపేటలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి దొంతి మాధవరెడ్డి..టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డిపై గెలిచారు. అయితే అప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన సరే మాధవరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.
ఇక 2018 ఎన్నికల్లో సుదర్శన్ టీఆర్ఎస్ నుంచి బరిలో దిగితే...మాధవరెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. కానీ ఈ సారి విజయం సుదర్శన్‌ని వరించింది. మొదటి సారి ఎమ్మెల్యే అయిన సుదర్శన్..నర్సంపేట ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు..అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక ఇక్కడ పలు సమస్యలు కూడా ఉన్నాయి..రూరల్ ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేవు...తాగునీటి సౌకర్యం తక్కువ...ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్తితి ఏ మాత్రం బాగోలేదు. అటు నర్సంపేటలో కొందరు టీఆర్ఎస్ నేతల అక్రమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ భూములని కబ్జా చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
రాజకీయంగా సుదర్శన్‌కు నర్సంపేటపై ఫుల్ గ్రిప్ ఏమి రాలేదు..అటు కాంగ్రెస్ నుంచి మాధవరెడ్డి ఉన్నారు..ఆయన ఈ సారి ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు. ఇటు బీజేపీలో రేవూరి ప్రకాశ్ రెడ్డి ఉన్నారు. గతంలో రేవూరి టీడీపీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంపై ఆయనకు పట్టు ఉంది..నెక్స్ట్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. మరి ఈ సారి కారు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నుంచే కాకుండా కమలం నుంచి కూడా గట్టి పోటీ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: