హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీఆర్ఎస్‌లో ఈ ఎమ్మెల్యేనే టాప్..!

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి పనిచేస్తున్న నాయకుల్లో సి.లక్ష్మారెడ్డి కూడా ఒకరు. మొదట నుంచి టీఆర్ఎస్ బలోపేతం కోసం లక్ష్మారెడ్డి కష్టపడుతూనే వస్తున్నారు. కేసీఆర్ సపోర్ట్‌తో 2004లో జడ్చర్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అసలు మహబూబ్‌నగర్‌ జిల్లాలో అప్పటిలో టీఆర్ఎస్‌కు ఉన్న ఏకైక పెద్ద నాయకుడు ఈయనే. ఆయన నిదానంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఇక కాంగ్రెస్ పొత్తు నుంచి బయటకొచ్చేశాక 2008లో టీఆర్ఎస్ ఉపఎన్నికలకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఆ ఉపఎన్నికలో లక్ష్మారెడ్డి ఓడిపోయారు.
ఇక 2009లో టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జడ్చర్ల సీటు టీడీపీకి దక్కడంతో లక్ష్మారెడ్డికి పోటీ చేయడానికి కుదరలేదు. కానీ అప్పుడు జడ్చర్లలో టీడీపీ గెలుపుకు, మహబూబ్‌నగర్ పార్లమెంట్‌లో పోటీ చేసిన కేసీఆర్ గెలుపు కోసం పనిచేశారు. తెలంగాణ వచ్చాక 2014లో మరొకసారి జడ్చర్ల బరిలో లక్ష్మారెడ్డి పోటీ చేసి గెలిచారు. అలాగే కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.
2018 ఎన్నికల్లో కూడా లక్ష్మారెడ్డి సూపర్ విక్టరీ సాధించారు. అయితే ఈ సారి క్యాబినెట్‌లో ఛాన్స్ దొరకలేదు. దీంతో ఎమ్మెల్యేగానే పనిచేసుకుంటూ వెళుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా వేగంగా చేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి రూ.కోట్లాది నిధులను తీసుకొచ్చి జడ్చర్లలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. పట్టణ ప్రధాన రహదారుల విస్తరణ, పార్కులు, సి‌సి రోడ్లు, డ్రై నేజీల నిర్మాణాలు జరిగాయి. అదేవిధంగా పోలేపల్లి సెజ్‌లో ఫార్మా పరిశ్రమల ఏర్పాటుతో నియోజకవర్గంలో ప్రజలతో పాటు చుట్టూ పక్క ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. ఫార్మా పరిశ్రమలతో జడ్చర్లలో వ్యాపారాలు విస్తృతంగా పెరిగాయి.
ఇలా అన్నీ పనులు చేసి పెడుతున్నారు కాబట్టి లక్ష్మారెడ్డిపై వ్యతిరేకత రాలేదు. జిల్లాలో పనితీరులో ఈయనే టాప్‌లో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరుపున మల్లు రవి పనిచేస్తున్నారు. బీజేపీకి అంత బలం లేదు. అయితే లక్ష్మారెడ్డికి నెక్స్ట్ గెలవడం సులువే అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: