యువతలో తగ్గిపోతున్న శృంగారాశక్తి : జపాన్ పై టైం-బాంబే

గత 25 సంవత్సరాలనుండి జపాన్ లో పెరుగుతున్న వయసుమళ్ళిన వాళ్ళు సంఖ్య భయపెడుతుంతుంటే యువతలో సంతానోత్పత్తి శాతం ధారుణంగా పడిపోవటం చాలా దిగ్భ్రాంతికర పరిణామాలకు దారితీస్తుంది. సంతానలేమి, మరణాల్లో తరుగుదల శాతం,  వృద్ధుల సంఖ్య పెరుగుదల, ఇవన్నీ జాతీయ ఉత్పాదకతపై ధారుణ ప్రభావాన్ని చూపిస్తున్నాయి.


వయోవృద్ధుల మరణాలు నూతన శిశు జననాల నిష్పత్తి సరైన పంధాలో లేకపోవటం  జనాభా సంఖ్య ఏటికేటికి తగ్గుతూ జాతి పై బాంబ్ పడ్దంత ప్రభావం కలిగిస్తుంది. ఈ జనాభా తరుగుదల ఇప్పుడు చాలా సంక్లిష్ట స్థితికి చేరుకుంది.  జపాన్ స్త్రీలు నవ జాత శిశువులకు జన్మనివ్వక పోవటానికి తగినంత ఉత్సాహం చూపక పోవటంతో గత 24 సంవత్సరాల్లో సగానికి సగం జనాభా తగ్గి జనన మరణాల  సమతౌల్యత అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. 


యు.బి.ఎస్ అనే స్విట్జర్లాండ్ చెందిన అంతర్జాతీయ ఆర్ధిక సేవల కంపని తాజా సర్వే ప్రకారం జపాన్ లో 2015 సంవత్సరములో ఒక మిలియన్ జననాలు సంభవిస్తే, 1.3 మిలియన్ మరణాలు సంభవించి ఒక్క సంవత్సరములోనే 0.3 మిలియన్ జనాభా తగ్గిపోయింది. అంటే మూడు లక్షల జనాబా తరుగుదల ఏర్పడిందన్నమాట.  ఈ విధమైన జనాభా పరిస్థితిని క్షయాన్ని “జపానైజేషన్” అంటున్నారు.  అందుకే జపాన్ స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి) గత 20 సంవత్సరాలుగా స్వల్ప మార్పులతో చాల నిలకడగా ఉంది. దీనికి పడిపోతున్న జనసంఖ్య కారణమని “యు.బి.ఎస్ డేటా”  చెప్పుతుంది .


జపాన్ మాత్రమే కాదు అభివృద్ది చెందిన, అభివృద్ది చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలు (దేశాలు) కూడా ఈ జపానైజేషన్ అనుసరిస్తే ఇదే పరిస్థితి సంభవిస్తుంది. జపానైజేషన్ ను 1990 దశాబ్ధం నుండి అన్నిదేశాలకు ఆదర్శం గా ఉండేది. కాని సుధీర్ఘ కాలగమనములో దీని ప్రభావం చాలా దయనీయంగా తయారైంది. ఎదుగుతున్న వయసుతో యువకులు వృద్దులై-పారిశ్రామిక దేశాలకు ప్రగతి నిరోదకాలై పోతున్నారు. నూతన జననాలు సరిగా లేక యువత లో పెరుగుదల శాతం దాదాపు ప్రతి సంవత్సరానికి, సంవత్సరానికి తరుగుదల నమోదు చేస్తుంది.


ఏ దేశంలో నైనా ప్రతి స్త్రీ సగటున 2.2 నవజాత శిశువులకు జన్మనిస్తే ఆ దేశములో వృద్దుల మరణాల సంఖ్యతో  “సంతానోత్పత్తి భర్తీ”  సాధిస్తుంది అనేది సామాజిక శాత్రవేత్తల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. వనితలు 2.2 సంతానోత్పత్తి అందించని దేశాలలో (పనిచేయగల వయసున్న) యువత రానున్న దశాబ్ధాల్లో ఇప్పుడు జపాన్ పడే అవస్థలను అవీ అనుభవిస్తాయనే సామాజిక శాత్రవేత్తల అభిప్రాయం. ఆదేశాలేవంటే అమెరికా (1.87 సంతానోత్పత్తి నిష్పత్తి), డెన్మార్క్ (1.73), చైనా (1.6), మరియు సింగపూర్ (0.81) కాకపోతే జపాన్ పరిస్థితి ఇంకా ధారుణం (0.03) గా ఉండటం చాలా విచారకరం.    

 

ఫర్టిలిటి రేటు తరచుగా మార్పులకు సామాజిక అలవాట్లవల్ల పడిపోవటం జపాన్లో జరుగుతుంది. ఉదాహరణకు జపాన్లో ఇప్పుడు వయసులోకి వస్తున్న యువత శృంగారంపై పెద్దగా ఆశక్టి కనబరచటం లేదు కారణం భౌతికంగా శరీరాల కల్యిక స్పర్శ నచ్చకపోవటమే. దీన్నే జపన్ రచయిత 'మకి ఫువసావా ఈ కాలపు జపాన్ యువతను "హెర్బియోర్ మెన్" అని వర్ణించుతున్నారు. అంటే వీళ్ళకు అమ్మాయిలన్నా, వాళ్ళతో స్నేహమన్నా సఖ్యత కలగని ఒక స్థితిలో ఉంది. 


యువ పురుషులిలా ఉంటే యువతులు ఇతర పారిశ్రామిక దేశాల్లో లాగా వైట్ కాలర్ సంస్కృతికి అలవాటుపడి వివాహాలను ఆలస్యం చేయటమో, అసలు నిరాకరించటమో చేయటం ఒక విధానం (ట్రెండ్) గా మారింది. కుటుంబ జీవితాలకు దూరమవటానికి అతి తక్కువ జీతభత్యాలు, నిలకడ లేని  ఉద్యోగ అవకాశాల తో గత దశాబ్ధాల తరబడి కుటుంబాలను పోషించలేక ఉద్యోగాలతో కాలం గడుపుతున్నారు. దీనితో యువత వివాహలను వదిలేసి ఉద్యోగాలతో గడపటం తో వృద్దుల జనాభాతో నిష్పత్తితో యువ జనాభా పెరగటం లేదు. యు.బి.ఎస్ పరిశోధన ప్రకారం వారి ఆర్ధిక ప్రగతి కోసమైనా ప్రభుత్వాలు కుటుంబ సంస్కృతిని కొనసాగించటానికి ప్రభుత్వం ప్రొత్సాహకాలనిచ్చైనా జాతిని ముందుకు నడిపించాలి. ఈ క్రమములో వారి అవసరాలను తీర్చవలసిన అవసరముంది.


ఆ ప్రోత్సహకాలు యువతీ యువకులు తల్లి-దంద్రులయ్యే సందర్భములో ప్రత్యేక సెలవులు, శ్రామిక అనుకూల విధానాలు, కొత్తగా ఈ దంపతులు తల్లిదంద్రులైనప్పుదు పెద్ద మొత్తములో పిల్లల పెంపకానికి సెలవులను ఇస్తూ, అనుకూల సమయాల్లో పని చేసే పని సంస్కృతిని ప్రకటించాలని సలహా ఇచ్చింది. తద్వారా జపానైజేషన్ ప్రమాదం నుండి పైన పేర్కొన్న దేశాలు తమకు తగిన పద్దతిలో విధానాలు రూపొందించుకొని ఫెర్టిలిటి ప్రమాదం నుండి బయట పడితే తప్ప ఆదేశాలకు జపానైజేషన్ ప్రమాదం తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: