కుక్కలు వాహనాల టైర్ల పై.. ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయో తెలుసా?

praveen
ఈ భూమ్మీద ఉండే జీవుల్లో అత్యంత విశ్వాసం కలిగిన జీవి ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా శునకం పేరు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇక శునకం విశ్వాసానికి మారుపేరుగా ఉంటుంది. ఒక్కసారి కాసింత అన్నం పెట్టి చేరదీసాము అంటే చాలు ప్రాణం పోయేంతవరకు కూడా ఇక ఆ వ్యక్తి పట్ల విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అందుకే మనుషులకి కుక్కలకి మధ్య మొదటి నుంచి బంధం ఎంతో బలంగానే ఉంది.

 ఇక ఇటీవల కాలంలో అయితే ప్రతి ఇంట్లో కూడా నచ్చిన శునకాన్ని తెచ్చుకొని ఇంట్లో మనిషిలాగ పెంచుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. ఇక కుక్కలు మనుషులకు ఎంతో తోడ్పాటును అందిస్తూ ఉంటాయి. చెప్పిన విషయాలను నేర్చుకుంటాయి. ఇక ప్రమాదాలను ముందుగానే కనిపెట్టగలుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ప్రకృతి వైపరీత్యాలను కూడా కుక్కల ముందుగానే గుర్తిస్తాయి అని శాస్త్రవేత్తల సైతం చెబుతూ ఉంటారు. అయితే కుక్కల్లో ఉండే ఒక అలవాటు ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూనే వస్తుంది.

 అదే మూత్ర విసర్జన చేసే అలవాటు. ఏకంగా వాహనాల టైర్ల పై విద్యుత్ స్తంభాలపై గోడలపై మూత్ర విసర్జన చేస్తూ ఉంటాయి కుక్కలు. అయితే ఇలా కుక్కలు ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయి అన్న విషయం చాలామందికి తెలియదు.  సాధారణంగా మనుషులు మాట్లాడుకోవడానికి ఎన్నో దారులు ఉన్నాయి. కానీ జంతువులు మాట్లాడలేవు. ఇక ఉత్తర ప్రత్యుత్తరాలు చేరవేయలేవు. అందుకే కమ్యూనికేషన్ కోసం ఇలా మూత్రవిసర్జన మార్గాన్ని అనుసరిస్తాయట. చుట్టూ ఉన్న కుక్కలతో కమ్యూనికేషన్ కోసం వాహనాల టైర్లు విద్యుత్ స్తంభాలపై మూత్రపిసర్జన చేస్తయట. భూమిపై మూత్ర విసర్జన చేస్తే అది వెంటనే గాల్లో కలిసిపోతుంది. అది కాకుండా వాహనాలు వస్తువులపై మూత్ర విసర్జన చేస్తే ఇక తాము తిరిగే ప్రదేశాన్ని ఉండే ఏరియాను ఇతర కుక్కలకు తెలియజేసే అవకాశం ఉంటుందని కుక్కలు అలా చేస్తాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: