చలికాలంలో చర్మంపై వచ్చే బ్రేకౌట్స్ ని బీట్రూట్ తో చెక్ పెట్టండి..!
సాధారణంగా బీట్ రూట్ లో ప్రొటీన్ పైబర్,పొటాషియం, మెగ్నిషియం,ఐరన్లకు పుట్టినిల్లు అని చెప్పవచ్చు.దీనిని తీసుకోవడంతో,ఇది మన బ్లడ్ ను ప్యూరిఫై చేయడమే కాక,ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మృతకణాలను తొలగించి,చర్మరంధ్రాలు,నల్లమచ్చలను మరియు వృద్ధాప్యఛాయలకు కూడా తొందరగా నివారణ కలిగిస్తుంది.
ఈ మాస్క్ కోసం ముందుగా ఒక బీట్రూట్ ని తీసుకొని బాగా శుభ్రం చేసి తురిమి ఉంచుకోవాలి.ఇందులోని అర స్ఫూన్ శనగ పిండి,రెండు టీ స్పూన్ల కలబంద గుజ్జు, రెండు టేబుల్ స్పూన్ల పాలు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖాన్ని పట్టించే ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసి,తడి లేకుండా టవల్ తో తుడుచుకోవాలి.ఇప్పుడు పైన చెప్పిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట నుంచి గంటసేపు ఆరనివ్వాలి.ఇలా ఆరిన ముఖాన్ని ఎటువంటి సోప్ లేకుండా గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు చర్మ రంధ్రాలు ఓపెన్ అయి ఉంటాయి. కనుక ఇప్పుడు ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ని రాయడంతో రంద్రాలు మూసుకుపోతాయి.
ఇలా వారానికి రెండు నుంచి మూడుసార్లు చేయడం వల్ల,చర్మం డిహైడ్రేషన్ తగ్గి,ముఖంపై ఉన్న బ్రేకౌట్స్ కి నివారణ కలుగుతుంది.అంతేకాక ముఖంపై ఉన్న మొటిమలు,మచ్చలు,మృతకణాలు కూడా తొలగిపోయి,ముఖం మెరుపుని సంతరించుకుంటుంది. మీరు కూడా ఇటువంటి సమస్యతో బాధపడుతూ ఉంటే,వెంటనే ఈ మాస్కుని ట్రై చేయండి.మరియు రోజుకు 3 నుంచి 4 లీటర్స్ నీటిని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.