ఈ ఒక్క పండు తినడం వలన ఏన్ని ఆరోగ్య ప్రయోజనాలో.?

Suma Kallamadi
ఆప్రికాట్ పండు గురించి మీరు వినే ఉంటారు.ఈ పండులో ఎన్నో రకాల పోషక విలువలు దాగున్నాయి. డ్రై ఫ్రూట్స్ లో ఆప్రికాట్ కూడా ఒకటి.ఈ పండు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఆప్రికాట్ పండులో క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్,విటమిన్ ఎ, ఐరన్,విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. మరి ఈ డ్రై ఫ్రూట్ పండు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడేవారికి ఆప్రికాట్ ఉత్తమమైన ఆహారం అని చెప్పవచ్చు.ప్రతి రోజు ఒక ఆప్రికాట్ పండు తింటే హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి పెరిగి రక్తహీనత సమస్య అనేది నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. 


అలాగే రోజుకో డ్రై ఆప్రికాట్ తింటే మల బద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు.ఈ పండులో పెక్టిన్, సెల్యులోస్ అనే పీచు పదార్ధం సమృద్ధిగా ఉంటుంది.ఇవి శరీరంలో వాటర్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడతాయి.ఫలితంగా మలబద్ధకం సమస్య రాకుండా చేస్తాయి.ప్రతి రోజు భోజనానికి ముందు ఒక డ్రై ఆప్రికాట్ తింటే జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. జ్వరంగా ఉన్నప్పుడు ఆప్రికాట్ జ్యుస్ లో తేనే కలుపుకొని త్రాగితే జ్వరం తీవ్రత తగ్గుముఖం పడుతుంది.


డ్రై ఆప్రికాట్ జ్యూస్ ఎక్జిమా, దురద, తామర వంటి వాటిని నివారిస్తుంది.అలాగే మొటిమల వంటి అనేక చర్మ సమస్యలను తగ్గిస్తుంది.డ్రై ఆప్రికాట్ లో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన గుండె సమస్యలు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. డ్రై ఆప్రికాట్ లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. విటమిన్ ఎ కంటి చూపుకు బాగా సహాయపడుతుంది. విటమిన్ ఎ ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్.కావున ఆప్రికాట్ పండు తినడం వలన కంటికి సంబందించిన సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజు ఆప్రికాట్ పండును రోజువారీ ఆహారంలో భాగం చేసుకుని మీ ఆరోగ్యాన్ని మీరే  కాపాడుకోవాలి మరి. !



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: