జీవిత సత్యాలు: మీ మాటకు ఎంత శక్తి ఉందో తెలుసా...?

ఒక మాట అంటే.. అది హృదయం నుంచి వస్తుంది..దానికీ కొంత శక్తి ఉంది. ఓ మంచి మాట.. మనం అంటే.. అది నిజం అయ్యేందుకు ప్రకృతి సహకరిస్తుంది. అందుకే ఎప్పుడూ శుభం పలకాలి అంటారు.. పెద్దలకు నమస్కరిస్తే.. అందుకే.. అంతా శుభం జరగాలని దీవిస్తారు. ఎందుకు.. వారు దీవిస్తే అంతా మంచి జరుగు తుందా.. మాటకు అంత విలువ ఉందా..? 

 


ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేం.. కానీ మాటకు శక్తి ఉందనేది నిజం. అది పాజిటివ్ శక్తిని సృష్టిస్తోంది. సానుకూల ఆలోచనలను కలిగిస్తుంది. అందుకే.. పెద్దలు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, అభీష్టాలు సిద్ధించాలని పెద్దలు ఆశీస్సులు ఇస్తారు. నిండుమనసుతో, తృప్తి నిండిన హృదయంతో ఇచ్చే నిష్కల్మష ఆశీ ర్వచనంలో బలం ఉంటుంది.

 

 

ఈ విషయాన్ని మన  ఉపనిషత్తులు కూడా చెబుతున్నాయి. అవేమంటున్నాయంటే.. శుద్ధత్వం ఉండే వాచక శక్తి కాబట్టి అమృతంతో సమానమట. అందుకే.. పెద్దల ఆశీస్సులు నైతిక బలాన్నిస్తాయి. జీవితంలో అవి మనల్ని ముందుకు నడిపించే శక్తులవుతాయి. మనకు తెలియ కుండానే మనకు మనోస్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు అర్థమైందా.. మీ మాటకు ఎంత శక్తి ఉందో..! 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: