చేయి నరుక్కొని.. కవర్ లో వేసుకొని ఊరంతా తిరిగిన యువకుడు! లాక్ డౌన్ ప్రభావమేనా?

కొందరు చేసే పనులు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏకంగా అరచేయిని నరుక్కుని దానిని కవర్లో కట్టుకున్నాడు ఓ యువకుడు. అంతటితో సరిపెట్టుకోకుండా దానిని పట్టుకుని ఊరంతా తిరిగాడు. ఈ దారుణమైన ఘటన ఒడిశాలో జరిగింది.

ఆ వ్యక్తి తన చేయి ని నరుక్కుని.. దానిని కవర్ లో పెట్టుకుని ఊరంతా తిరగడంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఒడిశా లో చోటు చేసుకుంది. గంజాం జిల్లా దిగపొహండి వద్దపి.సమేశ్వర రెడ్డి అనే యువకుడు తన ఇంటి పెరట్లో ఉన్న పదునైన ఆయుధం తీసుకొని చేతిని మణికట్టు వరకు నరుక్కున్నాడు. ఆ చేతి ముక్కను ఓ కవర్ లో వేసుకున్నాడు. దీనితో... గ్రామస్థులు హతాశులయ్యారు. వెంటనే ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు, అతనిని ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు..ఆ యువకుడి మానసిక పరిస్థితి బాగోలేదని అందుకే అలా చేసి ఉంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. అతని వయసు 20 ఏళ్లు. ఏదేమైనా కొద్ది సేపు అతను ఊరంతా అల్లకల్లోలం చేసేశాడు.

అతను అసలు ఆ పనిని ఎందుకు చేశాడో ఇప్పటికీ పోలీసులకి తెలియలేదు. మొత్తానికి కవర్ చేయి వేసుకుని తాపీగా ఊరంతా తిరిగి అతను నొప్పితో కొద్దిగా కూడా లేకపోవడం గమనార్హం దారుణమైన ఘటన చూసి కొంత మంది అతనికి ఏదైనా అంటువ్యాధి సోకి ఉంటుందని అందుకే అతను ఇలా పిచ్చి గా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు.

ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేవాడు ఒక్కసారిగా ఇలా ప్రవర్తించడం గ్రామస్థులు జీర్ణించుకోవడం లేదు. లేదా ఈ లాక్ డౌన్ వల్ల అతను మానసికంగా ఇలా తయారయ్యాడా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: