బుడుగు: ​చిన్నారుల్లో దంతక్షయం ఎలా వస్తుంది..!?

N.ANJI
చిన్నపిల్లలకు స్ట్రీట్ ఫుడ్స్ అంటే బాగా ఇష్టం. తరచూ ఐస్ క్రీమ్స్, చాక్లట్స్ తినటానికి ఇష్టపడతారు. వీటివల్ల దంతాల ఇన్ఫెక్షన్లకు గురై దంతక్షయం వంటి సమస్యలు వస్తాయ.  ఇలా జరిగినప్పుడంతా ఆ భాగంగా భరించలేని నొప్పి వస్తుంటుంది. ముఖ్యంగా ఈ నొప్పి దంతాలలో కానీ, లేదా అవి ఉన్న దవడ ఎముకలలో కానీ ఉండొచ్చు. దీనికి ముఖ్య కారణం ఒకటే.. దంత మూలాలో ఇన్ఫెక్షన్లు  కలగడం. తద్వారా దంతక్షయం కలుగుతుంది.దంతాలపైన ఎనామిల్ అని ఉంటుంది. ఇది చల్లటివి ఎక్కువగా తాగిన, తిన్న జివ్వుమనిపిస్తుంది. దంతక్షయం వల్ల ఈ సున్నితభాగం మనం తీసుకునే చల్లటి ఆహారం వల్ల నొప్పిని ఇంకా ఎక్కువ చేస్తుంది.
చిన్నపిల్లలకు పళ్లు రావటం ప్రారంభమయ్యేది.. ఆరు నెలల నుంచే. వీటిని మనం పాలపళ్లు అంటారు. వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే వాటి కింద ఉంటే శాశ్వత దంతాలకు రక్షణ ఉంటుంది.  కొన్నాళ్లకు పాలపళ్లు ఊడిపోతాయి. వాటిస్థానంలో శాశ్వత దంతాలు వస్తాయి. ఇలా చాలా మంది అనుకుంటూ ఉంటారు.  కానీ వాస్తవానికి అవి రావటానికి చాలా సమయం పడుతుంది.  ఆ నొప్పి మాత్రం ఎక్కువవుతూ.. వాపుకూడా వస్తుంది. ఒకవేళ నొప్పి ఎక్కువైందంటే.. ఆ ఇన్ఫెక్షన్ శాశ్వత దంతాలకు కూడా పాకుతుంది.

పాలపళ్లు ఏవైతే ఉన్నాయో ఇవి శాశ్వత దంతాలు సరైన క్రమంలో రావటానికి ఉపయోగపడతాయి. 
కాబట్టి పాలపళ్లను అశ్రద్ధ చేయకూడదు. ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రతత్గా చూసుకోవాలి. చిన్నపిల్లల్లో దంతాలు పాడైతే వాళ్లు సరిగా ఆహారాన్ని నమలలేరు. తీసుకోలేరు. దాంతో వారికి పౌషికాహారంలోపం ఏర్పడుతుంది. కాబట్టి మొదటినుంచే దంతాలను జాగ్రత్తగా సంరక్షించుకోవటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఒకవేళ దంతాలు సరైన పద్దతిలో రాలేదంటే పిల్లలు ఎదిగే కొద్ది చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది వారి బాహ్యసౌందర్యం మీద కూడా పడవచ్చు. దానివల్ల మళ్లీ ఆపరేషన్లు అంటూ తిరగాల్సన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పుడు అపురూపంగా చూసుకోవాలి. అప్పుడే వారి వృద్ధి బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: