బుడుగు: పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించినపుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. !!

Suma Kallamadi
పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించడం అనేది చాలా ముఖ్యం.వైద్యరంగ నిపుణుల సూచన ప్రకారం ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కొరకు ప్రతి బిడ్డకి వ్యాక్సినేషన్ చేయించాలి. ప్రాణాంతరకరమైన వ్యాధుల నుండి పిల్లలను కాపాడాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి. దురదృష్టవశాత్తు కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకోవటంలేదు.ఫలితంగా పిల్లలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. మీ బిడ్డకి సరైన సమయంలో వ్యాక్సిన్స్ అలాగే ఇమ్మునైజెషన్ ఇప్పించడం మరచిపోకండి.అలాగే మీ బిడ్డకి వ్యాక్సిన్ వేయించేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటో చూద్దాం.. !!




మీ బిడ్డని వాక్సినేషన్ కోసం తీసుకెళ్లినప్పుడు వైద్యుడు కొన్ని చెక్ అప్స్ చేసి మీ బిడ్డ వాక్సిన్ కి సిద్ధంగా ఉందో లేదో తెలుసుకుంటారు.అంటే జలుబు, జ్వరం, విరేచనాల వంటి కొన్ని ఆరోగ్యసమస్యలు ఏవి లేవు అని నిర్ధారణ చేసుకోవాలి.అలాగే  వ్యాక్సినేషన్ సమయంలో పిల్లలు అసౌకర్యానికి గురై ఏడవడం సహజం. వ్యాక్సినేషన్ చేయించేటప్పుడు మీ బిడ్డని మీరు గట్టిగా పట్టుకోవాలి. ఒక వేళ మీ బిడ్డని అదుపు చేయడం మీకు ఇబ్బంది అయితే స్టాఫ్ మెంబర్ సలహా తీసుకుని వాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.వాక్సిన్ ని అందించే విధానాలు అనేకం. పోలియో కిచ్చే వ్యాక్సిన్ ఓరల్ వ్యాక్సిన్. అంటే బిడ్డ నోట్లో చుక్కలు వేయడం మాత్రమే.అలాగే  కొన్ని రకాల వాక్సిన్లను ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తారు. ఇంజెక్షన్స్ ద్వారా ఇచ్చే వ్యాక్సిన్లలో కూడా వివిధ రకాలున్నాయి. ఆయా వ్యాక్సిన్ల బట్టి ఇంజెక్షన్ చేసే స్థానం మారుతుంది. కొన్ని వ్యాక్సిన్ ఇంజెక్షన్స్ ను చేతులకి ఇస్తే మరికొన్నిటిని తొడలపై ఇస్తారు.




అలాగే వాక్సినేషన్ ఇచ్చిన తరువాత వైద్యులు మీ బిడ్డని పది నుంచి పదిహేను నిమిషాల వరకు గమనిస్తారు. వాక్సినేషన్ వలన అలెర్జీలు కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గాని కలగలేదని నిర్ధారించుకున్న తర్వాతనే వాక్సిన్  వేస్తారు.  వ్యాక్సినేషన్ తరువాత ఒక వేళ ఏమైనా తీవ్రమైన ఇబ్బందులకు మీ బిడ్డ గురైతే మీరు ఖచ్చితంగా మీ బిడ్డని హాస్పిటల్ కి తీసుకెళ్లాలి.ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పి లేదా వాపు,తేలికపాటి జ్వరం, వాంతులు మరియు వికారం, అతిసారం మరియు విరేచనాలు లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మీ బిడ్డలో తేలికపాటి జ్వరంని గమనిస్తే సాధారణంగా మీరు తీసుకునే జాగ్రత్తలు సరిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: