బుడుగు : పిల్లల్లో ఆకలిని పెంచే అద్భుతమైన ఆహార నియమాలు ఇవే...!

Suma Kallamadi

చాలా మంది తల్లితండ్రులకు సాధారణంగా పిల్లలకు పెట్టె ఆహారం గూర్చి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. నెలల చంటి పిల్లల నుండి వయసు పెరిగేకొద్దీ పిల్లలకు ఎటువంటి ఆహారాన్ని తినిపించాలి?  ఎటువంటి ఆహారాన్ని పిల్లలు ఇష్టపడతారు? పిల్లల్లో ఆకలిని పెంచే ఆహార పదార్థాలు ఏవి? ఇలాంటి ప్రశ్నలు ప్రతి అమ్మ కి వస్తుంటాయి. అందుకనే పిల్లల్లో ఆకలిని పెంచే కొన్ని ఆహార పదార్థాలు గూర్చి  తెలుసుకుందాం... ఎక్కువగా చాలా మంది పిల్లలు  ఆహారం తీసుకోవటానికి ఇష్టపడరు అయితే చిరు తిండి తినటానికి మాత్రం బాగా  ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ముందుగా వారిని చిరుతిండ్లకు దూరం పెట్టడం వల్ల సరైన ఆహారం తీసుకోవటానికి ఇష్టపడతారు అలాగే పిల్లల వయస్సు పెరుగుతున్న కొద్దీతల్లి  పాలను వీలైనంత వరకు తగ్గించి ఆకలిని పెంచే ఆహార పదార్థాలపై దృష్టిని మళ్లించాలి.

 

 

 

 

 

అందుకని తాజా పండ్ల రసాలను  డైరెక్ట్ గా కాకుండా అందులో  మీరు పాలు కలిపి ఇవ్వటం వలన పిల్లలు ఇష్టంగా తింటారు. ఫ్రూట్ జ్యూస్ లను ఇష్టపడని పిల్లలకు బనానా, ఆపిల్,  జామ కాయ, సపోటా పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కోసి  ఇస్తే ఇష్టంగా తింటారు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు పోషక ఆహార పదార్థాలను తినిపించాలని తెలుసు కానీ ఆ పోషకపదార్థాలు అంటే మాత్రం ఏంటో  తెలియదు. వాల్ నట్స్ డ్రైఫ్రూట్స్, ఎగ్,  వెన్న రాసిన చపాతీలు,  బాదంపప్పు, నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు పిల్లలకు ఆకలిని పెంచడంతో పాటు మంచి ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి.

 

 

 

 

 

పిల్లలకు నిర్ణిత సమయానికి తినాలి అని బలవంతంగా ఆకలి కలగకుండా తినిపించడం వల్ల ఆహారం తీసుకోవడానికి ఇష్టపడరు  కాబట్టి పిల్లల్ని  ఆహారం తినమని బలవంతం చేయకూడదు.అలాగే ఆకలి మందగించిన పిల్లలకు అరటిపండును బాగా గుజ్జుగా చేసుకుని తినిపించవచ్చు లేదా అందులో కొంచెం చక్కెర, పాలు  కలిపి పెడితే  ఇష్టంగా తింటారు. పిల్లలకు ఎప్పుడైనా త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తినిపించాలి లేకపోతే కడుపునొప్పి, వాంతులు, వికారం సమస్యలు తలెత్తుతాయి. నూనె మసాలా పదార్థాలు కొన్ని రోజుల వరకు దూరంగా ఉంచడమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: