అల్లరి చేసే గాడిద!

Durga
ఒక రోజు క్రిష్ణదేవరాయల కొలువులో పండిత సభ జరుగుతుంది. అనేక దేశాలనుండి చాలామంది పండితులు వచ్చారు ఆ సభకి. రకరకాల ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నారు. ఆ పండితులు... కానీ ఆ సభలో గుసగుసలుః, ఒకరితోఒకరు మాట్లాడుకోవడంతో నిశ్శబ్దం కొరవడింది. చివరకు పండితులు చెప్పింది ఎవరికీ అర్థం కాకుండా పోయింది. దానితో రాయలవారికి విసుగు అనిపించి తెనాలి రామకృష్ణ చెవిలో ఈ విషయం చెప్పాడు. అంతట తెనాలి రామకృష్ణ ఆలోచించి సభను ఉద్దేశించి ఇలా అన్నాడు. పండితుల్లారా... ఈ సభలో జరుగుతున్న కార్యక్రమం వల్ల ఎన్నో తెలియని విషయాలు మనకు తెలస్తున్నాయి. కానీ ఇక్కడున్నవారు ఉద్ధండ పండితులమన్న విషయం మరిచి సభలో గోల చేస్తున్నారు. ఇది మీకు తగునా.. అన్నాడు. కొద్దిసేపు బాగానే ఉన్నా, మరలా మామూలుగానే సభలో గుసగుసలు ప్రారంభమైయినాయి. వెంటనే రామకృష్ణుడు గట్టిగా మాట్లాడుతూ మీకు ఒక కథ చెబుతాను కస్తా వినండి. అని ఒక అడవిలో ఒక రోజు అన్ని జంతువులను సమావేశం ఏర్పాటు చేయబడింది. ఆ సమావేశంలో వాటి ప్రవర్తనను బట్టి ఏ జంతువునకు ఏ పేరు పెట్టాలో నిర్ణయించ బడింది. హుందాగా, టీవిగా ఉండే దానికి సింహం అని, జిత్తులమారి పని చేసే దానికి నక్క అని, పిచ్చిపిచ్చి పనులు చేసే దానిని కోతి అని, విశ్వాసం చూపి దానికి కుక్క అని, గొడవ, గోల చేసేదానికి గాడిద అని అన్నారు. అనగానే సభలో నిశ్శబ్దం అలుముకుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: