పవన్, చరణ్ సినిమాల్లో.. చిరంజీవి ఫేవరెట్ ఏంటో తెలుసా..??

murali krishna
సినిమా ఇండస్ట్రీకి  ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మెగాస్టార్ ఎదిగిన చిరంజీవి నీడ నుంచి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్..ఇలా చాలామంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. వీరిలో చిరంజీవికి అత్యంత ఇష్టమైన వారంటే.. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్. చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని కూడా రామ్ చరణ్ లా కొడుకు లాగానే భావిస్తారు. చరణ్ సినిమాలు చూసి ఒక తండ్రిగా ఎంత మురిసిపోతారో పవన్ సినిమాలు చూసి కూడా అంతే మురిసిపోతారు. మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ జయాపజయాలతో సంబంధం లేకుండా విజయవంతంగా సాగుతోంది. ఇంటర్వ్యూలలో భాగంగా చిరంజీవి చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.తాజాగా చిరంజీవి పవన్ , రామ్ చరణ్ సినిమాలలో ఇష్టమైన సినిమాల గురించి వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. చిరంజీవి తాజాగా పద్మవిభూషణ్ అందుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి పద్మవిభూషణ్ అందుకోవడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
కిషన్ రెడ్డితో చిరంజీవి మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాలలో తొలిప్రేమ , తమ్ముడు, జల్సా సినిమాలు ఇష్టమని చరణ్ సినిమాల్లో మగధీర  సినిమా ఇష్టమని చిరంజీవి వెల్లడించారు. అయితే మెగా అభిమానులు సైతం చిరంజీవికి నచ్చిన సినిమాలే తమకు కూడా ఇష్టమని చెబుతున్నారు. చిరంజీవి కెరీర్ విషయానికి వస్తే విశ్వంభర  సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ ఈ సినిమాతో కెరీర్ పరంగా మరో సంచలన విజయాన్ని అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు.ఈ మధ్య కాలంలో సోషియో ఫాంటసీ సినిమాలకు ఊహించని స్థాయిలో ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో విశ్వంభర సైతం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంతో పాటు బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు గర్వ కారణం కాగా చిరంజీవి ఇంకా మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. 68 సంవత్సరాల వయస్సులో సైతం సినిమాల కోసం చిరంజీవి పడుతున్న కష్టాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.చిరంజీవి యంగ్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. మల్లిడి వశిష్ట  చిరంజీవికి ఏ రేంజ్ అందిస్తారో చూడాలి. చిరంజీవి ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తన సినిమాలకు నష్టం వస్తే ఆదుకునే హీరోలలో సైతం ఈ మెగా హీరో ముందువరసలో ఉంటారు. ఎంతోమంది యంగ్ హీరోలు సైతం చిరంజీవి తమకు ఇన్స్పిరేషన్ అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: