ఏపీ:ఫలితాల వేళ అధికారం పై పరిపూర్ణానంద జోష్యం..!

Divya
మరి కొన్ని గంటలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలుబడనున్నాయి. ఈ సమయంలో వైసీపీ ప్రభుత్వం గెలుస్తుందా లేకపోతే కూటమి గెలుస్తుందా అనే అనుమానాలకు తెర పడబోతోంది. అయితే ఇరువురు పార్టీలకు విజయం అంత ఈజీగా కాదని ఎగ్జిట్ పోల్స్ కూడా తేల్చి చెప్పేశాయి.. అయితే కొన్ని సర్వేలు వైసీపీ పార్టీ గెలుస్తుందని చెప్పగా మరికొన్ని కూటమి గెలుస్తుందని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్నికల ఫలితాల పైన కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ రెండవసారి సీఎం పదవిని వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతారని జోష్యం చెప్పారు.. అటు దేశంలో కూడా ఎన్డీఏ కూటమి మరొకసారి అధికారంలో చేపడుతుందని వెల్లడించారు. మూడోసారి మోదీ ప్రధానమంత్రి అవుతారని కూడా వెల్లడించారు.తనకు ఒక ముఖ్యమైన వ్యక్తి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ విషయాలను చెబుతున్నానని కూడా తెలియజేశారు. అలాగే వైసిపి పార్టీ 123 స్థానాలను సైతం అధికమిస్తుందని పరిపూర్ణానంద స్వామి తెలియజేశారు.

అలాగే హిందూపురంలో ఊహించని పరిణామం చూడబోతున్నారని కూడా జోష్యం చెప్పారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు వైసీపీ వైపు ఎక్కువగా మగ్గు చూపారని ఆ పార్టీకి వచ్చిన అధిక శాతం ఓట్లు వారి నుంచే వచ్చేవి అని పేర్కొన్నారు. బిజెపి పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఉన్నప్పటికీ పరిపూర్ణానంద స్వామి ఇండిపెండెంట్గా హిందూపురం నియోజకవర్గం నుంచి నిలబడ్డారు. హిందూపురంలో కూడా చాలా క్లిష్టమైన పరిస్థితి ఇప్పుడు ఏర్పడినట్లు తెలుస్తోంది. కచ్చితంగా అక్కడ ఓట్లను చీల్చే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఏ మేరకు పరిపూర్ణానంద స్వామి చెప్పిన వాక్యాలు నిజమవుతాయో చూడాలి మరి. ఏది ఏమైనా ఇన్ని రోజులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఫలితాలు ఈ రోజుతో తేలబోతున్నాయి. మరి ప్రజలు ఎవరికి పట్టం కట్టారు చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: