రీల్స్ కోసం ఎంతకు తెగించార్రా! ఏకంగా భవనంపై అలా..?

Purushottham Vinay
రీల్స్ కోసం ఎంతకు తెగించార్రా!  ఏకంగా భవనంపై అలా..?ప్రస్తుతం అందరి చేతికి స్మార్ట్ ఫోన్ అనేది అందుబాటులోకి వచ్చాక మానవుని లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.పైగా బడ్జెట్ ధరల్లోనే మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ లభిస్తుండడంతో వీటి వినియోగం ఎక్కువైపోయింది.సోషల్ మీడియాకు జనాలు బాగా అడిక్ట్ అయిపోతున్నారు. చిన్నా పెద్దా భయం బాధ్యత  లేకుండా సోషల్ మీడియాలో రకరకాల పిచ్చి పిచ్చి విన్యాసాలు చేస్తున్నారు. తక్కువ సమయంలోనే ఫేమస్ అయ్యేందుకు ప్రమాదకర రీతిలో రీల్స్ చేస్తూ చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. లైకుల కోసం, కామెంట్ల కోసం నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి రీల్స్ చేస్తున్నామో అన్న సంగతి కూడా మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు నేటి యువత. ఈ క్రమంలో ఓ యువతి రీల్స్ పిచ్చితో ఎత్తైన భవనంపై నుంచి గాల్లో వేలాడుతూ రీల్స్ షూట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.సోషల్ మీడియాలో కొంతమంది డ్యాన్సులతో, మరికొందరు ఫన్నీ వీడియోస్ తో, క్రియేటీవ్ కంటెంట్ తో రీల్స్ చేసి సెలబ్రిటీ అయిపోవాలని ఒళ్లు మరిచి మరీ రీల్స్ చేస్తున్నారు.


ఏకంగా నడిరోడ్డుపై డ్యాన్సులు చేస్తూ పబ్లిక్ కి బాగా ఇబ్బందులు కలిగేలా వ్యవహరిస్తున్నారు. రీల్స్ మోజులో పడి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈమధ్య కాలంలో చాలా మంది యువత రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయినా యువతలో ఏమాత్రం మాత్రం మార్పు రావడం లేదు. ఓ యువతి అయితే సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఏకంగా బిల్డింగ్ పై నుంచి వేలాడుతూ రీల్స్ చేసింది. పూణే - జంబుల్‌వాడి స్వామినారాయణ మందిర్ సమీపంలోని ఒక పాడుబడిన భవనంపై ఇలా తన ప్రాణాలను ప్రమాదంలో నెట్టి స్టంట్స్ చేసింది ఆ యువతి.ఆ వీడియోలో చూసినట్లైతే.. పూణే నగరంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఓ ఎత్తైన భవనం అనేది ఉంది. ఆ భవనంపై రీల్స్ చేసేందుకు రెడీ అయ్యారు ఇద్దరు యువకులు ఓ యువతి. ఇంకేముంది ఆ ముగ్గురు కలిసి భవనంపైకి ఎక్కారు. ఓ యువకుడు అయితే సెల్ ఫోన్ లో ఆ దృష్యాలను షూట్ చేసేందుకు మరో యువకుడు యువతి చేయి పట్టుకుని గాల్లోకి జార విడిచాడు. కొన్ని సెకన్ల పాటు ఆ యువతి గాల్లోనే వేలాడుతూ కనిపించింది. ఏమాత్రం పొరపాటు జరిగినా కూడా ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు అయితే ఇదేం పైత్యం తల్లీ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ విజువల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: