ఏపీలో ఫ్రీ బస్ అమలుకు సమస్యలు ఇవేనా.. అప్పటివరకు ఏపీ మహిళలు ఆగాల్సిందే!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ఎప్పటినుంచి అమలు అవుతుందో అనే చర్చ జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మహిళలు ఈ స్కీమ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ స్కీమ్ ఎప్పటినుంచి అమలవుతుందనే చర్చ జోరుగా ప్రజల మధ్య జరుగుతుండగా పక్క రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాతే ఈ స్కీమ్ ను అమలు చేయనున్నారని సమాచారం అందుతోంది.
 
రవాణాశాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కొత్త బస్సులను కొని మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందజేస్తామని అన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమలుకు సంబంధించి ఎదురవుతున్న ఆటుపోట్లను పరిశీలించి ఈ స్కీమ్ ను అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఏపీలో ఈ స్కీమ్ అమలు చేయాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందేనని తెలుస్తోంది.
 
మరో 3 నెలల తర్వాత ఈ స్కీమ్ అమలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ స్కీమ్ అమలైతే ఏపీ మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఇతరులపై ఆధారపడే అవకాశాలు తగ్గుతాయి. మరోవైపు ఈ స్కీమ్ అమలుకు సంబంధించి ఎలాంటి షరతులు విధిస్తారనే ప్రశ్నకు సంబంధించి సమాధానాలు దొరకాల్సి ఉంది. ఏపీ ఫ్రీ బస్ స్కీమ్ వల్ల ఆటోలపై ఏ మాత్రం ప్రభావం పడుతుందో సైతం తెలియాల్సి ఉంది.
 
ఏపీ ప్రజలకు ఉపయోగపడేలా మరిన్ని మంచి పథకాలను అమలు చేస్తే ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్స్ కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మహిళలకు టీడీపీ సర్కార్ నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పగా ఈ స్కీమ్ ఎప్పటినుంచి అమలవుతుందనే ప్రశ్నలకు సంబంధించి కూడా సమాధానాలు దొరకాల్సి ఉంది. ఏడాదిలోగా టీడీపీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చితే బాగుంటుందని చెప్పవచ్చు. తల్లికి వందనం స్కీమ్ అమలుకు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కూటమి సూపర్ సిక్స్ హామీలు మాత్రం ప్రజల్లో మంచి పేరును సొంతం చేసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: