టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణుల్లో శ్రీ లీల ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. ఇకపోతే ఈమె తాజాగా ఓ సినిమా నుండి తప్పుకుంది. అసలు విషయంలోకి వెళితే ... కొంత కాలం నవీన్ పోలిశెట్టి హీరోగా అనగనగా ఒక రాజు అనే సినిమా అనౌన్స్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో మొదటగా శ్రీ లీల ను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత చాలా కాలం పాటు షూటింగ్ జరగలేదు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి ఒక చిన్న వీడియోని విడుదల చేశారు. ఆ వీడియో ద్వారా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా ఎంపిక అయినట్లు మేకర్స్ ప్రకటించారు. దీనితో శ్రీ లీల ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మీనాక్షి చౌదరి ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ఫుల్ జోష్లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ బ్యూటీ ఈ సంవత్సరం మొదటిగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.
అలాగే తమిళ సినిమా గోట్ లో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా నటించింది. ఇకపోతే తెలుగులో లక్కీ భాస్కర్ , మెకానిక్ రాఖీ అనే సినిమాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇలా మీనాక్షి అదిరిపోయే రేంజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ కెరియర్ను ఫుల్ జోష్లో ముందుకు సాగిస్తుంది.