జగన్‌: ఉదయం 10:30 నుంచే వైసీపీ సంబరాలు ?

Veldandi Saikiran
ఉదయం 10:30 నుంచే వైసీపీ సంబరాలు చేసుకోవాలని వైసీపీ నేత, ఏపీ సర్కార్‌ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. 21 రోజుల నిరీక్షణ తర్వాత ఎన్నికల ఫలితాలు రిలీజ్‌ కానున్నాయి. నేటి మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో స్పష్టత రానుంది. 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది, 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్థుల పోటీలో ఉన్నారు. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ఒంటరిగా పోటీ చేసింది.

అయితే.. ఈ ఎన్నికల ఫలితాలపై సజ్జల మాట్లాడారు. ఈ సారి ప్రతిదీ నిబంధనలకు విరుద్ధంగానే ఈసి చేస్తుంది..ఈసి పై చంద్రబాబు కంట్రోల్ ఉందని తెలిసిపోతుందని ఆగ్రహించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్డీఏ తో పొత్తు పెట్టుకునప్పటి నుండి ఈసి ద్వారా అధికారులపై వత్తిడి తెచ్చారని సంచలన ఆరోపణలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎవరెన్ని పాచికలు విసిరినా వైసిపి ముందు అవి పారవు..వైసిపి బలమైన పార్టీ.. బలమైన మెజారిటీ తో గెలుస్తున్నామని వివరించారు సజ్జల రామకృష్ణారెడ్డి.  టిడిపి సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం ఈ ఒక్క రోజు వరకే..అంటూ చురకలు అంటించారు. చంద్రబాబుకు పిక్చర్ తెలుసు కనుక గుమ్మనంగా ఉన్నాడు..నారా లోకేష్ అయితే అసలు అడ్రెస్స్ లేడంటూ చురకలు అంటించారు.

 
జాతీయ స్థాయిలో కొన్ని సర్వేలు బిజెపి కోసం ఎన్డీఏ వైపు ఇచ్చాయి..ఎన్డీఏ కు 400 చూపించడం కోసం ఆ సంస్థలు అలా సెట్ చేశారని ఆగ్రహించారు.
వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ చూసి జనం నవ్వుకుంటున్నారు..తప్పుడు సర్వేలు చూసుకుని టిడిపి నేతలు సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. టిడిపి సంబరాలు తాత్కాలికం మాత్రమే.. అసలు సంబరాలు ఇవాళ మేము చేస్తామన్నారు.

 
కౌంటింగ్ కి అన్ని రకాలుగా సిద్దంగా ఉన్నాం...అందరికీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చామని వివరించారు వైసీపీ నేత, ఏపీ సర్కార్‌ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి. కౌంటింగ్ పూర్తి అయ్యి డిక్లరేషన్ తీసుకునే వరకూ ఎవరూ కేంద్రాల నుండి బయటకి రావద్దని చెప్పామన్నారు. ఇవాళ ఉదయం 10.30 నుంచి 11  గంటలకు సంబరాలకు సిద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాం..సుప్రీం కోర్టు కొట్టేసినా ఈసి చేసింది తప్పే అని అందరికీ తెలుసు అన్నారు వైసీపీ నేత, ఏపీ సర్కార్‌ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: