ఏపీ పోలటిక్స్: సోషల్ మీడియా పై.. ప్రత్యేక నిఘా.. అలా చేస్తే జైలుకే..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ మరో కొన్ని గంటలలో జరగబోతోంది.. ఇలాంటి సమయంలో పోలీసులు అధికారులు స్ట్రాంగ్ రూముల వద్ద శాంతి భద్రతల కోసం 67 కంపెనీల కేంద్రబలగాలని సైతం దింపారు.. కౌంటింగ్ సెంటర్ల చుట్టూ రెడ్ జోన్ 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 కూడా అమలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2000 సున్నిత ప్రాంతాలను సైతం గుర్తించినట్లుగా అధికారులు తెలియజేశారు.. ఇప్పటివరకు 12,000 మందిపై బైండోవర్ కేసులు కూడా నమోదు చేసినట్లుగా వెల్లడించారు ఈసీ అధికారులు. అదనంగా మరో 50 కంపెనీల సిఆర్పిఎఫ్ బలగాలను కూడా తీసుకోవచ్చారు.

ఇలా చూసుకుంటే మొత్తం మీద 5600 మంది కేంద్ర బలాలను సైతం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, చిత్తూరు వంటి ప్రాంతాలలో భారీగాని కేంద్ర బలగాలని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఐదు అంచల భద్రతను కూడా ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్లతో ప్రత్యేకమైన నిఘాలు కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ నేపథ్యంలో నాలుగు ఐదవ తేదీలలో విజయోత్సవ ర్యాలీలకు ఎవరికి అనుమతి ఇవ్వకూడదంటూ రద్దు చేశారు ఈసీ. ఇప్పటికే అన్నిచోట్ల పోలీసులు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు.

ఎవరైనా గొడవ చేస్తే రౌడీషీటర్ ఓపెన్ చేస్తామంటూ సిఐ హెచ్చరిస్తున్నారు.. కౌంటింగ్ కేంద్రాలలో ప్రతి బ్లాకు ఒక కంట్రోల్ రూమ్ ఉంటుందంటూ వెల్లడించారు. అన్ని నియోజకవర్గాలలో ప్రత్యేకంగా స్లైకింగ్ ఫోర్సులు కూడా అందుబాటులో ఉంచామని వెల్లడించారు. నేడు రాష్ట్రంలో మద్యం దుకాణాలు బారు వంటివి అన్నిటిని కూడా బంద్ చేసినట్లుగా తెలిపారు.కౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియా పైన ఎక్కువగా పోలీసులు ఫోకస్ పెట్టారు వ్యాఖ్యలు పోస్టులు చేసిన వారిపైన సీరియస్గా నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేశారు.. గీత దాటితే తాటతీస్తామంటూ ఏపీ డీజీపీ అందరికీ వార్నింగ్ ఇస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఫోటోలను వీడియోలను రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సంబంధించి వాటిని వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం షేర్ చేయడం కూడా నిషేధమంటూ తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: