అప్పటినుంచి.. ప్రతిరోజు యుద్ధమే చేస్తున్నా : ఖలీల్ అహ్మద్

praveen
ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ కి ఈ రేంజ్ లో క్రేజ్ ఉంది కాబట్టే అటు ఎంతో మంది యువకులు కూడా క్రికెట్ నూ ఫ్యాషన్ గా మార్చుకుంటూ ఆ వైపుగా అడుగులు వేస్తూ ఉన్నారు అని చెప్పాలి. దీంతో ఇక టీమ్ ఇండియాలో కొత్త ప్రతిభ ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూ ఉండడంతో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక భారత జట్టులో చోటు సంపాదించుకోవడానికి ఎంతో మంది క్రికెటర్లు ఎంతో గట్టిగానే శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాలి.

అయితే ఎంత బాగా రాణించిన  భారత జట్టులో చోటు దక్కుతుంది అనే విషయంపై కూడా కొన్ని కొన్ని సార్లు అనుమానాలు నెలకొంటున్నాయి. ఎందుకంటే కొంతమంది ప్రతిభగల క్రికెటర్లు ఒకప్పుడు టీమిండియా తరపున అరంగేట్రం చేసినప్పటికీ ఆ తర్వాత పేలవమైన  ఫామ్ తో జట్టులో చోటు కోల్పోయిన వారు ఉన్నారు. అయితే ఇక మళ్ళీ పుంజుకొని రాణించినప్పటికీ ఇప్పటికీ భారత జట్టులో చోటు దక్కక నిరీక్షణగా ఎదురు చూస్తూ ఉన్నారూ అని చెప్పాలి. అలాంటి వారిలో ఖలీల్ అహ్మద్ కూడా ఒకరు. అయితే ఇటీవల అటు తన కెరీర్ గురించి మాట్లాడుతూ ప్రతిరోజు యుద్ధమే చేయాల్సి వస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు యువ ఆటగాడు ఖలీల్ అహ్మద్.

 ఢిల్లీ క్యాపిటల్స్  తరఫున ఆడుతున్న ఈ ఆటగాడు 2019 నవంబర్లో చివరిసారిగా భారత జట్టు తరఫున ఆడాడు. ఆ తర్వాత ఎక్కడ కనిపించలేదు. ఇన్నేళ్లకు మళ్ళీ టీమ్ ఇండియా తరపున వరల్డ్ కప్ కి ఎంపిక అయ్యాడు అని చెప్పాలి. అయితే గత నాలుగున్నరేల్లుగా చాలా ఇబ్బంది పడ్డాను  అప్పటినుంచి ప్రతి రోజు కూడా మానసికంగా యుద్ధమే చేస్తూ ఉన్నాను. మంచి రోజులు వస్తాయనే నమ్మకంతోనే ఉన్నా. ఇక ఇన్నాళ్ళకి మళ్లీ భారత జట్టులో చోటు దక్కడం సంతోషంగా ఉంది. ఇది నాకో ముందడుగు అంటూ ఖలీల్ అహ్మద్ చెప్పొచ్చాడు. కాగా ఈ యువ ఆటగాడు చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: