చంద్ర‌బాబు Vs జ‌గ‌న్‌: ప‌థ‌కాలు : అధికారులు - ప‌నితీరు - విజ‌న్‌

RAMAKRISHNA S.S.
- బాబు 18 గంట‌లు క‌ష్ట‌ప‌డినా ఫ‌లితం జీరోనే
- ప‌బ్జి ఆడ‌తాడ‌ని సెటైర్లు ఉన్నా ఫ‌లితం రాబ‌ట్టిన జ‌గ‌న్‌
- అధికారుల‌తో బాబు బాగా బిజీ.. జ‌గ‌న్ చెప్ప‌కుండానే చేయించేస్తారు
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
రోజుకు 18 గంట‌లు క‌ష్ట‌ప‌డ‌తార‌ని.. అహ‌ర‌హం.. ప్ర‌జ‌ల కోసం శ్ర‌మిస్తార‌ని.. రాష్ట్ర అభివృద్ధి కోసం స్వ‌ప్ని స్తార‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు పేరు. ఇది నిజ‌మే. దీనిలో ఎలాంటిసందేహం లేదు. కానీ, లీడ‌ర్‌గా ప్ర‌భుత్వాన్ని న‌డిపించే నాయ‌కుడు ఇలా చేయ‌డం త‌ప్పుకాకున్నా..ఫ‌లితం చూసుకుంటే.. మాత్రం పెద్ద గా క‌నిపించ‌డం లేదు. ఇది ఆయ‌న విష‌యంలో అతి పెద్ద మైన‌స్‌. సోమవారాన్ని పోల‌వారం.. చేసుకుని.. ఉరుకులు ప‌రుగులు పెట్టించినా.. అది సాధ్యం కాలేదు. నిరంత‌ర స‌మీక్ష‌ల‌తో అమ‌రావ‌తి రాజ‌ధానిని ప‌రుగులు పెట్టించాల‌ని భావించినా.. అది కూడా `తాత్కాలిక‌`మే అయిపోయింది.

అంటే.. ఎలా చూసుకున్నా.. చంద్ర‌బాబు త‌ను ప‌నిచేశారు..అధికారుల‌తోనూ ప‌నిచేయించారు. కానీ, ఫ‌లి తం చూసుకుంటే క‌నిపించ‌డం లేదు. ఇక‌, ఇదే విష‌యంలో వైసీపీ అధినేత‌, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ పెద్ద‌గా ప‌నిచేసిన‌ట్టు క‌నిపించ‌రు. అందుకే ఒకానొక ద‌శ‌లో 2021-22 మ‌ధ్య సీఎం జ‌గ‌న్ ఏం చేస్తున్నార‌ని ఎవ‌రైనా అడిగితే.. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా.. సెటైర్లు వేసేశారు. ప‌బ్జి ఆడుకుంటున్నార‌ని వ్యంగ్యాస్త్రా లు రువ్వేవారు. కానీ.. ఇది నిజ‌మేనా? అని చూస్తే.. కాదు.. తాను చేయాల్సిన ప‌ని చేస్తూ... క్షేత్ర‌స్థాయిలో ఫ‌లితాలు రాబ‌ట్టుకునేలా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించారు.

ఈ కార‌ణం వ‌ల్లే.. ఇంటింటికీ ప‌థ‌కాలు అందుతున్నాయి. ఇంటింటికీ.. వ‌లంటీర్లు వ‌స్తున్నారు. ప్ర‌భు త్వం ఏం చేసినా.. ఎలాంటి నిర్న‌యం తీసుకున్నా.. ప్ర‌జ‌ల‌కు తెలిసే వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తీసు కువచ్చారు. అధికారుల వ‌ద్ద‌కు ప్ర‌జ‌లు వెళ్ల‌డం కాదు.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు అధికారులు వ‌చ్చే వ్య‌వ‌స్థ‌ను తీసు కువ‌చ్చారు. ఇది ఒక పాల‌కుడికి ఉండాల్సిన ల‌క్ష‌ణం. ఈ విష‌యంలో చంద్ర‌బాబు కంటే కూడా.. జ‌గ‌న్ దూకుడుగానే వ్య‌వ‌హ‌రించారు. ఎక్క‌డా ఆయ‌న అధికారుల‌ను ప‌రుగులు పెట్టిస్తున్న‌ట్టు క‌నిపించ‌దు.

కానీ, అధికారులు త‌ల‌కు మించిన ప‌నితో బిజీగా ఉంటారు. ఎక్క‌డా నేను భారీ ఎత్తున ప‌నిచేస్తున్నాన‌ని జ‌గ‌న్ చెప్ప‌రు. కానీ, చేయాల్సింది చేసేస్తారు. ఇదీ.. ఆయ‌న ప‌నితీరు.. అధికారుల‌ను న‌డిపించిన తీరు. ఇక‌, విజ‌న్ విష‌యానికి వ‌స్తే.. చంద్ర‌బాబు ల‌క్ష్యాల‌ను ముందుగానే చెబుతారు. గ‌తంలో విజ‌న్ - 2020  అన్నారు. త‌ర్వాత‌.. విజ‌న్ 2040 అన్నారు. ఇప్పుడు విజ‌న్‌-2047 అంటున్నారు. అప్ప‌టికి తాను రాష్ట్రాన్ని ఇలా చూడాల‌ని చెబుతారు. కానీ,జ‌గ‌న్ ఇలా చెప్ప‌రు. చేసి చూపిస్తారు. పోర్టులు క‌ట్టారు. 17 వైద్య శాల‌లు తీసుకువ‌చ్చారు. అదేవిదంగా విద్య‌లోనూ స‌మూల మార్పులు చేశారు. ఇవ‌న్నీ పైకి చెప్ప‌క‌పోయినా.. విజ‌న్ లో భాగ‌మే. సో.. ఇదీ.. ఈ ఇద్ద‌రి నేత‌ల‌కు ఉన్న తేడా!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: