ఈ రోజుకు ఎంతో గొప్ప చ‌రిత్ర ఉంది....ఎందుకంటే ఆ విశేషాల‌న్నీ ఈరోజే జ‌రిగాయి మ‌రి....

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో మార్చి 13 వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు..
1940: భారత స్వాతంత్ర్యోద్యమము: 1940 మార్చి 13 తారీకున, ఉధమ్ సింగ్, అమృతసర్ మారణ కాండకు (జలియన్‌వాలా బాగ్) బాధ్యుడిగా పరిగణింపబడిన మైకేల్ ఓ డైయర్ ని, లండన్ లో, కాల్చి చంపాడు.
1955: నేపాల్ రాజుగా మహేంద్ర అధికారం స్వీకరించాడు.
ప్ర‌ముఖుల జననాలు

1733: జోసెఫ్ ప్రీస్ట్‌లీ, ఆక్సిజన్ ను కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1804)
1854: కోలాచలం శ్రీనివాసరావు, నాటక రచయిత, న్యాయవాది. (మ.1919)
1899: బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. (మ.1967).బూర్గుల బహుభాషావేత్త, సాహితీవేత్త. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మరాఠీ, ఉర్దూ, పారశీక, సంస్కృత భాషల్లో బూర్గులకు ప్రావీణ్యం ఉంది. మహారాష్ట్రలో చదివే రోజుల్లోనే ఆంగ్లంలో కవితలు రాసేవాడు. పారశీక వాజ్మయ చరిత్ర ఆయన రచనలలో పేరు పొందినది. జగన్నాథ పండితరాయల లహరీపంచకమును, శంకరాచార్యుల సౌందర్యలహరి, కనకధారారాస్తవమును తెలుగులోకి అనువదించాడు. కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శారదస్తుతి, గౌరీస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి, శ్రీకృష్ణాష్టకం, రెడ్డి రాజుల కాలం-మత సంస్కృతులు (పరిశోధనా వ్యాసం) మొదలైనవి ఆయన ఇతర రచనలు.
1903: యసుటారో కొయిడే 112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు. (మ.2016)
1911: శ్రీనివాస చక్రవర్తి, అభ్యుదయ రచయిత, నాటక విమర్శకులు, నాటక విద్యాలయ ప్రధానాచార్యులు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకులు. (మ.1976)
1937: వల్లంపాటి వెంకటసుబ్బయ్య, సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
1980: వరుణ్ గాంధీ, భారతీయ జనతా పార్టీ యువనేత.
ప్ర‌ముఖుల మ‌ర‌ణాలు..
1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్.
1955: నేపాల్ రాజుగా పనిచేసిన త్రిభువన్.
1973: ముహమ్మద్ గులాం మొహియుద్దీన్,1948లో భారత విభజన సందర్భంగా విజయవాడలో ఏర్పడిన మతవైషమ్యాల నివారణకు ఆయన నడుం కట్టారు
1990: కన్నెగంటి సూర్యనారాయణమూర్తి, తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1896)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: