ఈరోజుకు అందుకే అంత ప్రత్యేకత... విశేషాలు తెలిస్తే షాకవుతారు..
ముఖ్య సంఘటనలు
1998: ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో ) ' టెలిఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానం' ప్రవేశపెట్టింది.
2008: క్యూబా అధ్యక్షుడిగా ఫిడెల్ కాస్ట్రో సోదరుడు రాల్ క్యాస్ట్రో ఎన్నికయ్యాడు.
ప్రముఖుల జననాలు
1894: అవతార్ మెహెర్ బాబా- (జననం 1894 ఫిబ్రవరి 25 మరణం 1969 జనవరి 31)
1932: సుబ్రతా బోస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (మ.2016)
1948: డానీ డెంజోంగ్ప, భారతీయ చలనచిత్ర నటుడు.
1974: దివ్యభారతి, ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి (మ.1993).నిర్మాత రామానాయుడు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం బొబ్బిలి రాజాతో పరిచయం చేసారు. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన తర్వాత 1992 లో విశ్వాత్మ అనే సినిమాతో బాలీవుడ్లో రంగప్రవేశం చేసింది. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. మే 1992 లో సాజిద్ నడియాడ్‌వాలాను వివాహమాడింది. ఏప్రిల్ 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద మరణం పాలయింది. ఇప్పటికీ ఆమె మృతికి కారణాలు అంతుపట్టకనే ఉన్నాయి.
ప్రముఖుల మరణాలు
1961: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, రచయిత
1995: ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు. (జ.1920)
2001: డోనాల్డ్ బ్రాడ్‌మాన్, అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (జ.1908)
2004: బి.నాగిరెడ్డి, తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1912)
2008: జస్టిస్ హంస్‌రాజ్ ఖన్నా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి.
2010: కాటం లక్ష్మీనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (జ.1924)
2016: ఆచ్చి వేణుగోపాలాచార్యులు, సినీ గీత రచయిత. (జ.1930)