బాబాయ్ షో కు అబ్బాయ్.. కానీ మధ్యలో ఊహించని ట్విస్ట్..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని తన తాత తారకరామారావు తర్వాత, నందమూరి వంశంలో అంతగా ప్రేమ చూపించింది బాబాయ్ బాలయ్యే. అలాంటి బాలయ్యకి, అబ్బాయ్ ఎన్టీఆర్ కి మధ్య గ్యాప్ ఉందని చాలా కాలంగా ప్రచారం జరిగింది. తన మనిషి వైసీపీలో ఉండటమే ఒక కారణం. ఏదేమైనా ఎప్పటికైనా అంతా తనవాళ్లుగానే ఎన్టీఆర్ భావిస్తాడు.ఐతే గత కొంత కాలంగా ఎన్టీఆర్ నుంచి బాబాయ్ బాలయ్యకి పాజిటివ్ సిగ్నల్స్ వెళుతున్నాయని, అందులో భాగంగానే, అన్ స్టాపబుల్ కి తారక్ ని పిలిపించాలనుకున్నారట. ఐతే ఈ సీజన్ ని రామ్ చరణ్ ఎపిసోడ్ తో ముగిస్తారన్నారు. కాని ఎన్టీఆర్ షోకి పిలిపించే వీడియో ప్రోమోని వదిలి, నెక్ట్స్ సీజన్ కమ్మింగ్ సూన్ అని వదులాలనుకున్నారట.అందులో భాగంగానే ఎన్టీఆర్ ఎపిసోడ్ కోసం ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్ లీకై, అలా ఈ వార్త వైరలైంది. ఇప్పుడు డాకూ మహారాజ్ ఈవెంట్ కి తారక్ గెస్ట్ అంటూ ప్రచారం ఊపందుకుంది. అలాంటిదేమైనా ఉంటే ఈ పాటికే పోస్టర్ వచ్చేదని, కాబట్టి ఇది కేవలం ప్రచారం అన్న మాట కూడా వినిపించింది. కాకపోతే ఒకేస్టేజ్ మీద బాబాయ్, అబ్బాయ్ ని ఉండేలా చేయాలని ఆఖరి నిమిషం వరకు నిర్మాత నాగవంశీ ప్రయత్నించాలనుకుంటున్నాడట.మరి చూడాలి ఇది ఎక్కడకు దారితీస్తుందో.