"గేమ్ ఛేంజర్" సెన్సార్ పూర్తి.. చరణ్ పెర్ఫార్మన్స్ కి స్టన్ అయిన సెన్సార్ యూనిట్..?

murali krishna
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ రూపొందించిన పాన్ ఇండియా సినిమా 'గేమ్ చేంజర్'. సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాయి. సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. మరి సెన్సార్ సభ్యులు సినిమాకు ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా? 'గేమ్ చేంజర్' సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఇంటర్వెల్ వచ్చే సమయానికి షాక్ అయ్యారని తెలిసింది. ఫస్ట్ ఆఫ్ బావుందని చెబుతున్నారు. అయితే ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు ఒక 'హై' ఇస్తుందని తెలిసింది.‌ ట్రైన్ ఎపిసోడ్ సీక్వెన్స్ ఒక 20 నిమిషాల్లో ఉంటుందని, అది ఎక్స్ట్రార్డినరీగా వచ్చిందని టాక్.గేమ్ చేంజర్' అసలు కథ అంతా ఇంటర్వెల్ తర్వాతే ఉంటుందని తెలిసింది. సినిమాకు హార్ట్ సెకండ్ హాఫ్ అని అంటున్నారు. స్టార్ ఫుల్ మేకర్ శంకర్ తన స్ట్రెంగ్త్ అంతా ఇంటర్వెల్ తర్వాత ఒక రేంజ్ లో చూపించారట. శంకర్ ట్రేడ్ మార్క్ పొలిటికల్ సినిమా అంటే ఎలా ఉంటుందో 'గేమ్ చేంజర్' విడుదల తర్వాత థియేటర్లలో ప్రేక్షకులు అందరూ చూస్తారని సెన్సార్ నుంచి రిపోర్ట్ అందుతుంది. రామ్ చరణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడడం ఖాయం అని సెన్సార్ కంప్లీట్ అయిన తర్వాత రిపోర్టులు వస్తున్నాయి. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి సినిమా చూశారు. సంక్రాంతికి గట్టిగా కొడుతున్నామని అభిమానులతో చెప్పమని నిర్మాత 'దిల్' రాజుకు ఆయన చెప్పారు. దాంతో మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదిలావుండగా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలో విడుదల కానున్న ఈ సినిమాలో రామ్ చరణ్ జంటగా కియారా అద్వానీ నటించారు. ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు చరణ్ జంటగా తెలుగు అమ్మాయి అంజలి సందడి చేస్తారు. టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయిన తమిళ దర్శకుడు - నటుడిగా ఇటీవల వరస విజయాలతో దూసుకుపోతున్న ఎస్.జె. సూర్య, మలయాళ సీనియర్ హీరో జయరాం, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: