కన్నడ ముద్దుగుమ్మ అయిన రష్మిక కన్నడ ఇండస్ట్రీ ద్వారానే సినిమాల్లోకి వచ్చింది. రక్షిత్ శెట్టి హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఘన విజయం అందుకుంది.ఇక ఈ సినిమా విడుదలై 8 సంవత్సరాలు పూర్తవ్వడంతో సినిమాకి సంబంధించిన పోస్టర్ అభిమానులతో పంచుకుంటూ కిరిక్ పార్టీ పోస్టర్ షేర్ చేసి ఒక పోస్ట్ చేశారు రిషబ్ శెట్టి. అయితే ఈ పోస్ట్ చూసి రిషబ్ శెట్టి రష్మిక మందన్నాని అవమానించినట్టు ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి ఇంతకీ కాంతారా హీరో రష్మికను ఎలా అవమానించారు అనేది ఇప్పుడు చూద్దాం.. రష్మిక కిర్రిక్ పార్టీ అనే సినిమా ద్వారా వచ్చినప్పటికీ కన్నడ ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం ఈమెని కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయాలి అనే స్టేజ్ కి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.
ఎందుకంటే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో రష్మికని కాంతారా సినిమా చూశారా అని అడిగితే అసలు ఆ సినిమా గురించి తెలియదు అన్నట్లుగా మాట్లాడి రిషబ్ శెట్టిని కన్నడ ఇండస్ట్రీని అవమానించింది. ఎందుకంటే రష్మిక ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రిషబ్ శెట్టి డైరెక్షన్ చేసిన కిర్రిక్ పార్టీ అనే మూవీ ద్వారానే. కానీ అలాంటిది ఆ హీరో తెలియదు.. ఆ సినిమానే తెలవదు అన్నట్లు మాట్లాడి కాంతారా మూవీ యూనిట్ ని అవమానించింది. ఇక కాంతారా మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత ఘనవిజయం సాధించిందో చెప్పనక్కర్లేదు.ఈ సినిమా తెలుగులో కూడా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కాంతారా సినిమా గురించి తెలియదు అని రష్మిక మాట్లాడి ట్రోలింగ్ కి గురైంది. అంతే కాదు కన్నడ ఇండస్ట్రీ రష్మికను బ్యాన్ చేయాలి అనే స్టేజ్ కి వెళ్ళిపోయారు.అయితే ఇప్పటివరకు రష్మికకి కన్నడలో ఒక అవకాశం కూడా రావడం లేదు.
ఈ విషయం పక్కన పెడితే తాజాగా కిర్రిక్ పార్టీ సినిమా విడుదలై 8 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో సినిమాని ఇంత ఆదరించినందుకు రిషబ్ శెట్టి థాంక్స్ చెబుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఆ పోస్టర్లో రష్మిక మందన్న మిస్సయింది. అయితే సినిమా హిట్ అవడంలో వన్ ఆఫ్ ది పార్ట్ అయినటువంటి రష్మిక మూవీ పోస్టర్లో కనిపించకపోవడంతో చాలామంది రష్మిక అభిమానులు సినిమాలో కీలకపాత్ర పోషించిన మా హీరోయిన్ ఫోటో లేకుండానే పోస్టర్ రిలీజ్ చేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. కానీ చాలామంది మాత్రం రిషబ్ శెట్టికి సపోర్టుగా నిలుస్తున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ తెలియదు కన్నడ సినిమా పేరు తెలియదు అని రష్మిక అవమానించిన దాంట్లో రిషబ్ శెట్టి చేసిన అవమానం ఎంత అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి పోస్ట్ చూసి రష్మిక కనిపించకపోవడంతో ఒక్కటి తగ్గింది పుష్ప అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.