శీతాకాలంలో నిమ్మరసం తాగితే కోల్డ్ అవుతుందా.. ఇందులో నిజమెంత..!
ఆధ్యయనం ఏం చెబుతుందో ఓసారి చూద్దాం. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ ను అందించడంలో మేలు చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ బలపడి ఇన్ఫెక్షన్లు అండ్ కోల్డ్ నుంచి కాపాడుతుంది. కానీ చలికాలంలో లెమన్ రసం తాగితే జలుబు చేస్తుందని అనుకోవటంలో ఏమాత్రం నిజం లేదని... ఎక్కడ ఇటువంటి నిరూపణ కూడా లేదని తాజాగా నిపుణులు వెల్లడించారు. కానీ శీతాకాలంలో నిమ్మరసం తీసుకుని ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యమంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కూలింగ్ ఓటర్ లో నిమ్మరసం కలుపుకుని తాగొద్దని సూచిస్తున్నారు.
అలాగే చాక్లెట్, పాలు వంటి పదార్థాలతో కలిపి తీసుకోవద్దు. దీంతో శరీరానికి పోషకాలు అందవు. కాగా గోరు వెచ్చటి బాటర్ లో నిమ్మరసం మిక్స్ చేసుకుని తాగండి. గొంతు సమస్యలు దూరం అవుతాయి. అలాగే జలుబు కూడా ఉండదు. నిమ్మలో విటమిన్ సి అండ్ యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాల్ని కలిగిస్తాయి. నిమ్మరసం బాడీలోని టాక్సిన్ల ను తొలగిస్తుంది. కాలేయం ఫంక్షన్ పనీతిరును మెరుగుపర్చడమే కాకుండా... జీర్ణ సంబంధ ప్రాబ్లమ్స్ కూడా చెక్ పెడుతోంది. జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది.