రష్మిక పెళ్లి గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు కూడా రష్మిక మందన్నా పెళ్లి గురించి అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే తాజాగా బాలకృష్ణ కూడా రష్మిక పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు. అంతేకాదు రష్మిక పెళ్లి సీక్రెట్ ఆయన బయట పెట్టడంతో ఈ విషయం విన్న చాలామంది నెటిజన్స్ రష్మిక సీక్రెట్ గా బాగానే మెయింటైన్ చేస్తుంది కదా అంటూ మాట్లాడుకుంటున్నారు.మరి ఇంతకీ రష్మిక పెళ్లికి సంబంధించి బాలకృష్ణ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఆహా ఓటిటి ప్లాట్ఫారంలో బాలకృష్ణ గత కొద్ది రోజులుగా అన్ స్టాపబుల్ సీజన్ కి హోస్టుగా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ అన్ స్టాపబుల్ షో కి గెస్ట్లుగా డాకు మహారాజు చిత్ర యూనిట్ వచ్చారు.ఈ సినిమా నిర్మాతలు అయినటువంటి నాగవంశీ, డైరెక్టర్ బాబి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లు వచ్చారు.
డాకూ మహారాజ్ చిత్ర యూనిట్ వచ్చిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ ప్రోమోలో ఏముందంటే.. ముందుగా డైరెక్టర్ బాబి వస్తారు. రావడంతోనే బాలకృష్ణ ఏంటండీ డైరెక్టర్ గారు చొక్కా మీద చొక్కా వేశారు అని అడుగుతారు. ఆ తర్వాత ఒక రకమైన సౌండ్ తో పాటు లైట్లు ఆఫ్ ఆన్ అవుతూ ఉంటాయి. ఇదేంటి ఇలా అవుతుంది అని బాలకృష్ణ అనుకునే లోపే థమన్ వస్తారు. ఇక తమన్ వచ్చాక ఫస్ట్ టైం థియేటర్లలో స్పీకర్లు పలిగిపోయాయి అంటే అది మీ సినిమా అంటారు. దానికి బాలకృష్ణ డైలాగ్ చెబుతూ స్పీకర్ల కెపాసిటీ పెంచండి.డాకూ మహారాజ్ వస్తుంది అంటూ చెప్పడంతో అక్కడున్న ప్రేక్షకులు ఖుషి అయ్యారు. అలాగే వెదర్ బాగా కూల్ గా ఉంది సిట్టింగ్ వేద్దామా అని బాలకృష్ణ అంటారు.ఆ తర్వాత నిర్మాత నాగ వంశీ,తమన్,బాబి లు సోఫాలో కూర్చున్నాక ఏంటి తమన్ మీ గురించి ఇంటర్నేషనల్ స్టోరీస్ వింటున్నాను.
మీకు అనుష్క అంటే బాగా ఇష్టమా అంటే అవును ఇష్టం అన్నట్లుగా తమన్ చెబుతారు...ఆ తర్వాత బాలకృష్ణ నాకు రష్మిక ఇష్టం..ఆమెకు పెళ్లి ఫిక్స్ అయిందట కదా అంటూ చెప్పారు. దానికి నాగ వంశీ అవును టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోనే. కానీ పేరు మాత్రం బయటికి చెప్పడం లేదు అంటూ మాట్లాడారు.దానికి బాలకృష్ణ పేరు చెప్పచ్చు కదా కాస్త లీక్ చేస్తే వెబ్సైట్లకు పనికి వస్తుంది అంటూ మాట్లాడారు. అలాగే ఊర్వశి రౌటేల మీద మీకున్న అభిప్రాయం ఏంటి అని నిర్మాత నాగ వంశీని అడగగా ఇప్పుడు చెబితే మా ఆవిడతో గొడవలు వచ్చేస్తాయి అంటూ మాట్లాడారు. అలాగే బాబి లవ్ స్టోరీ ని కూడా బాలకృష్ణ అడిగిన విషయం ప్రోమో ప్రస్తుతానికి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ ప్రోమోలో రష్మిక పెళ్లి గురించి బాలకృష్ణ మాట్లాడటం వైరల్ గా మారడంతో బాలకృష్ణ రష్మిక పెళ్లి గురించి లీక్ చేశాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు