సరదాగా గడిపేద్దాం... 2024కు గుడ్ బై చెప్పేద్దాం..!
ఆ సంవత్సరమంతా అలాగే ఉండే అవకాశం ఉందని కొందరు భావిస్తారు. ఇది అపోహ అయినప్పటికీ.. ఏదైతేనేం ఎంజాయ్ చేయడానికి ఓ అవకాశం అయితే దొరుకుతుందని చాలామంది ఫాలో అయిపోతుంటారు. కొత్త సంవత్సరంలో ఇకముందు కోట్టోద్దనుకున్న వారు లాస్ట్ డే పేరుతో 31 నాడు తినాలనుకుంటారు. న్యూ ఇయర్లో పలానా ఆహారాలు తినకూడదనుకున్నవారు చివరిసారిగా 31 నాడు తిని మానేస్తాం అనుకుంటారు. ఇలా అనేక విషయాల్లో థర్టి ఫస్ట్ సెంటిమెంట్ ను అరేస్తుంటారు మనోళ్ళు. మందు గట్టి మజా చెయ్యడానికి, రోడ్డుపై తిరగటానికి, డాన్సులు వేయటానికి పోలీసులు పర్మిషన్ ఎలాగో ఉండదు. కాబట్టి ఇంట్లోనే ఎంజాయ్ చేద్దామని ఇప్పటికే అనేకమంది ఫిక్స్ అయిపోతుంటారు.
పిల్లలు, పెద్దలు, ఆత్మీయులతో కలిసి సంతోషంగా, సరదాగా గడిపేందుకు రెడీ అయిపోయారు చాలామంది. ఇక కొందరు యూత్ పొరగాలైతే.. పబ్బుల్లో, రెస్టారెంట్లో పార్టీలతో, డీజే డాన్సులతో తమదైన రీతిలో ఎంజాయ్ చేసేందుకు మస్తు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ఒక్కరోజు సరదా... గడిపేసే... ఇక ఫస్టు నుంచి గోల్ వైపు సీరియస్ గా అడుగేయాలని భావించే వాళ్ళు, సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగాలని సాంగ్ డిప్రెషన్ తో ఉన్నారు. చూడాలి మరి ఈరోజును ఎవరు ఎలా ఎంజాయ్ చేస్తారో... కొత్త సంవత్సరంలో ఏం సాధిస్తారో! సో.. ఎంజాయ్ యువర్ లైఫ్ అండ్... హ్యాపీ న్యూ ఇయర్!