"రాబిన్ హుడ్" షూటింగ్ సమయంలో ఆ ఇద్దరితో అలాంటి అనుభవం.. శ్రీ లీల..?

frame "రాబిన్ హుడ్" షూటింగ్ సమయంలో ఆ ఇద్దరితో అలాంటి అనుభవం.. శ్రీ లీల..?

Pulgam Srinivas
తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత వేగంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో శ్రీ లీల ఒకరు. ఈ బ్యూటీ శ్రీకాంత్ కుమారుడు అయినటువంటి రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమెకు ధమాకా సినిమాతో మంచి విజయం వచ్చింది. దానితో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ అద్భుతమైన జోష్ లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.


తాజాగా ఈమె నితిన్ హీరోగా రూపొందిన రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకత్వం వహించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మూవీ లో చిన్న క్యామియో పాత్రలో కనిపించనుండగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. రాజేంద్రప్రసాద్ , వెన్నెల కిషోర్ ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ ని ఈ రోజు అనగా మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల సందర్భంగా శ్రీ లీల తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ బ్యూటీ తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించిన రాజేంద్రప్రసాద్ , వెన్నెల కిషోర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.


తాజాగా శ్రీ లీల మాట్లాడుతూ ... ఇప్పటి వరకు నా కెరియర్ లో చాలా సినిమాల్లో నటించాను. కానీ ఇంత సరదా మూవీ ఇప్పటివరకు చేయలేదు. నా సినిమా కెరియర్ మొత్తంలో రాబిన్ హుడ్ మూవీ పూర్తి ఎంటర్టైనర్ మూవీగా నిలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వెన్నెల కిషోర్ మరియు రాజేంద్రప్రసాద్ గారితో సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నేను బిగ్గరగా నవ్వాను అంటూ శ్రీ లీల చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: