ప్రస్తుత జీవన విధానంలో ఎక్కువ మంది జనాలు ఎదుర్కొంటున్న సమస్యలలో బీపీ సమస్య ఒకటి. ఇకపోతే రక్తపోటులో రెండు రకాలు ఉన్నాయి. హై బీపీ అయితే మరొకటి లో బిపి. హైబీపీ ఉన్నవారు తమ జీవితంలో రాబోయే కాలంలో ఏమవుతుందో అని డాక్టర్ల సలహాతో అనేక మందులను వాడుతూ వారు జీవన శైలిని బాగానే ఉంచుకుంటున్న వారు ఉన్నారు. ఇక లో బిపి ఉన్నవారు మాత్రం మాకు లో బిపి నే ఉంది కదా దాని వల్ల పెద్ద సమస్య ఏమి ఉండదు అని దానిని లైట్ తీసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇలా లో బీపీ ఉండి కూడా లైట్ తీసుకుంటున్న వారు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే. ఎందుకు అంటే లో బీపీ కూడా ఎంతో ప్రమాదకరమైంది.
దీని ద్వారా కూడా చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఇది ఒక్క సారిగా కాకుండా స్లో పాయిజన్ల మనిషి జీవన ప్రమాణాన్ని తగ్గిస్తుంది. పోయిన సంవత్సరం జూన్ నెలలో ICMR ఇండియా మధుమేహం అధ్యయనంలో దేశంలో 3 కోట్ల మందికి పైగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని నివేదిక వెళ్లడైంది. ఇక కొంత మంది కి లో బీపీ ఉంది అని తెలిసిపోతుంది. కానీ మరి కొంత మంది కి తమకు లో బీపీ ఉన్న విషయం కూడా తెలియదు.
ఇక తమకు లో బీపీ ఉన్న విషయాన్ని గుర్తించాలి అంటే దానికి ఒక చక్కటి ఉదాహరణ ఉంది. ఏమిటి అంటే భారీ స్థాయిలో పని చేసినప్పుడు అలసిపోవడం , విసుగు రావడం అనేది సర్వసాధారణం. కానీ చిన్న చిన్న పనులకు కూడా అలసిపోతూ విసుగు చెందుతున్నారు అంటే వారికి లో బీపీ ఉండే అవకాశాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే ఎవరికైతే లో బీపీ ఉంటుందో వారు కూడా డాక్టర్లను సంప్రదించి సరైన మందులను సరైన సమయాలలో వాడుతూ వస్తే వారి జీవన ప్రమాణం అద్భుతంగా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు.