ఆ ఇద్దరి ఉద్యోగాలు పీకేసిన మెగాస్టార్... టాలీవుడ్‌లో బన్నీని మించిన హాట్ టాపిక్..?
టాలీవుడ్ లో ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్టు సంధ్య థియేటర్ దగ్గర రేవతి అనే అభిమాని మృతి చెందటం రేవంత్ రెడ్డి ప్రసంగం ఇవన్నీ సంచలన వార్తలు గా ఉన్నాయి. మరోవైపు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం కూడా వార్తల్లో నిలిచింది. అయితే ఇప్పుడు బన్నీ అరెస్టు మించిన వార్త టాలీవుడ్లో తీవ్ర కలకలం రేపుతోంది. మెగాస్టార్ చిరంజీవి తన పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ జీకే మోహన్ .. పర్సనల్ మేనేజర్ గా పని చేస్తున్న బాబి లను తొలగించారు. ఈ హఠాత్ పరిణామం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయం వెనక ఆర్థిక వ్యత్యాసాల కారణమని తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ వెంటనే విధుల నుంచి తప్పుకోవాలని చిరంజీవి ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇ
టీవల కాలంలో చిరంజీవి పర్సనల్ ప్రొఫెషనల్ అకౌంట్స్ కు సంబంధించిన విషయాలలో చాలా అవకతవకలు జరిగిన విషయాన్ని చిరంజీవి సిబ్బంది గుర్తించి మోహన్ - బాబి లను ఆయన ప్రశ్నించారని సమాచారం. వీటిపై వారు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో వెంటనే వారిద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సమాచారం. అలాగే జీకే మోహన్ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొన్న ప్రముఖ కంటెంట్తో ఎఫైర్ కొనసాగిస్తున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ సంధ్య థియేటర్ విషయం తెలుగు మీడియాలో ను .. సోషల్ మీడియాలో ను ఎంత బాగా వైరల్ అవుతుందో ... ఇప్పుడు ఒకటి రెండు రోజులు పాటు అది మరిచిపోయి అందరూ ఈ విషయం చర్చించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ వార్త ఎన్ని రోజులు పతాక శీర్షిక ల్లో ఉంటుందో ? చూడాలి.