రేవంత్ మీటింగ్...టాలీవుడ్ కు షాక్ ఇచ్చిన నాగార్జున్ ?
ఇక ప్రభుత్వంతో తలపడలేక.... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలకు సిద్ధమైంది టాలీవుడ్ ఇండస్ట్రీ. ఇవాళ ఉదయం 10:00 సమయంలో బంజర హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో... సీఎం రేవంత్ రెడ్డి తో పాటు టాలీవుడ్ పెద్దలు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశం నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజ్, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, అల్లు అరవింద్ తోపాటు నిర్మాతలు దర్శకులు రాబోతున్నారు.
అయితే బడా హీరోలు చిరంజీవితో పాటు వెంకటేష్ వస్తున్నప్పటికీ... అక్కినేని నాగార్జున మాత్రం ఈ సమావేశానికి డుమ్మా కొట్టబోతున్నారట. ఆయనను ఆహ్వానించినప్పటికీ... తాను హైదరాబాదులో లేనని నాగార్జున చెప్పడం జరిగిందని వార్తలు వస్తున్నాయి. దీంతో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఒక్క హీరో లేకుండానే ఈ సమావేశం జరగనుంది. వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం, అక్కినేని నాగార్జున మధ్య మొదటి నుంచి గొడవలు ఉన్న సంగతి తెలిసిందే.
మొదట హైడ్రా తీసుకు వచ్చిన తర్వాత.. అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది రేవంత్ రెడ్డి సర్కారం. ఆ తర్వాత హీరోయిన్ సమంత అలాగే అక్కినేని నాగార్జున కుటుంబం పైన మంత్రి కొండ సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలోనే ఉంది. దీంతో అక్కినేని నాగార్జున అలాగే రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ విపరీతంగా పెరిగిపోయింది. ఇది మనసులో పెట్టుకుని అక్కినేని నాగార్జున ఈ సమావేశానికి రాలేకపోతున్నారట.