రేవంత్‌రెడ్డి హ్యాట్సాఫ్‌.. నీ ఒక్క నిర్ణ‌యం వంద‌ల థియేట‌ర్ల‌ను బ‌తికిస్తోందిగా...!

RAMAKRISHNA S.S.
ప్రస్తుతం టాలీవుడ్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న వార్‌ నడుస్తుందన్న చర్చలు వినిపిస్తున్నాయి. సంధ్య థియేటర్ సంఘటన తర్వాత రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ పై వ్యాఖ్యలు చేయటం .. ఆ వెంటనే బన్నీ ప్రెస్ మీట్ ఇలా వరుస సంఘటనలు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇదిలా ఉంటే సంధ్య థియేటర్ ఘటన తర్వాత ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే టిక్కెట్ రేట్లు పెంపు కూడా ఉండదని క్లారిటీ ఇచ్చారు. దీనిపై తెలంగాణలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కో సినిమాకు ఒక్కోరకంగా టిక్కెట్ ధరలు పెంచడం వల్ల సగటు ప్రేక్షకుడి ఇబ్బంది పడుతున్నాడని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. బెనిఫిట్ షో ల‌ టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చేది లేదని తెలంగాణ సర్కారు నిర్ణయం తర్వాత చాలామంది డిస్ట్రిబ్యూటర్లు .. ఎగ్జిబిటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

టికెట్ ధరలు పెంచి కొత్త సినిమా విడుదలైనప్పుడు ఎక్కువగా సినిమా చూసే కాలేజీ స్టూడెంట్స్ ... యువకులు ... మాస్ నుంచి అత్యధిక వసూలు చేయడం బాధాకరంగా ఉంది. అన్ని సినిమాలకు నిర్ణీత మొత్తంలోనే టికెట్ ధరలు ఉండేలా ? చూడాలని వారి కోరుతున్నారు. ఇలా చేస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మరికొన్ని సంవత్సరాలపాటు ప్రాణం పోసినట్టు అవుతుందని ... ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమా చూసి డబ్బులు రావాలి అనుకోవాలి కానీ ... తక్కువ ప్రేక్షకులతో ఎక్కువ డబ్బులు వసూలు చేయాలన్న నిర్మాతలు నిర్వచ‌నం స‌రి కాదని చెబుతున్నారు.

ఇలా అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేట్లు పెంచడం అనేది చిన్న సినిమాలకు చాలా ప్లస్ అవుతుందని చెబుతున్నారు. డబ్బున్న ప్రేక్షకులు మల్టీప్లెక్స్ లో సినిమాలు చూస్తారు .. అక్కడ సౌకర్యాలకు అనుగుణంగా ధరలు పెంచుకున్న పర్వాలేదు .. మధ్య తరగతి వాళ్ళు సింగిల్ స్క్రీన్ లకు వస్తారు. ఇక్కడ టికెట్ ధర 500 పెడితే ఎవరు రావటం లేదు .. సీఎం రేవంత్ రెడ్డి సింగిల్ స్క్రీన్ థియేటర్ల వాళ్ళు అందరూ సంతోషపడే నిర్ణయం తీసుకున్నారు అని తెలంగాణలో ఎగ్జిబిటర్లు .. డిస్ట్రిబ్యూటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: