అందరి ముందే దిల్ రాజుని తిట్టిన అల్లు అర్జున్..?

Pandrala Sravanthi
ఈరోజు అనగా డిసెంబర్ 26న టాలీవుడ్ సినీ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈరోజు ఉదయం 10 గంటలకు రేవంత్ రెడ్డి,భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో టాలీవుడ్ సినీ పెద్దలు అయినటువంటి అల్లు అర్జున్, దిల్ రాజు,చిరంజీవి, వెంకటేష్ లు సమావేశం కానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియాలో దిల్ రాజుని అల్లు అర్జున్ తిట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ దిల్ రాజుని అల్లు అర్జున్ ఎందుకు తిట్టారు..కేసు గురించి తిట్టారా లేక మరేదైనా కారణం ఉందా అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్దన్నగా మెగాస్టార్ చిరంజీవి వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక నిర్మాతల సంఘంలో అయితే దిల్ రాజుని ఇండస్ట్రీ పెద్దగా పిలుచుకుంటారు. అయితే దిల్ రాజు పై అల్లు అర్జున్ ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టయ్యాక ఇంటికి వెళ్లి దిల్ రాజు ఆయన్ని కలసి మాట్లాడారట.ఆ సమయంలోనే సినిమా ఇండస్ట్రీకి మీరు పెద్దగా ఉన్నారు. ఒక సెలబ్రిటీ ఎలాంటి తప్పు చేయని కేసులో ఇరుక్కుంటే మీరేం చేస్తున్నారు? ఇండస్ట్రీ పెద్దగా మీ బాధ్యత ఏంటి..ఇలా చేయని తప్పుకు నిందితుడిని చేశారు అంటూ దిల్ రాజు పై ఫైర్ అయ్యారట.

ఇక అల్లు అర్జున్ మందలించడంతో అలర్ట్ అయిన దిల్ రాజు వెంటనే శ్రీ తేజ్ కుటుంబానికి భరోసా ఇవ్వడంతో పాటు రేవంత్ రెడ్డి తో సమావేశం అవ్వడానికి మంతనాలు జరిపారని తెలుస్తోంది.ఇక ఈరోజు రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో అల్లు అర్జున్ ను కేసు నుండి బయట పడేయాలనే విషయాన్ని కూడా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ భేటీలో అల్లు అరవింద్ కూడా పాల్గొన్న పోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి కాబట్టి తన కొడుకు అల్లు అర్జున్ ని ఈ కేసు నుండి బయట పడేయడానికి ఎలాంటి ఆలోచనలు చేస్తారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: