28 ఏళ్ల త‌ర్వాత మెగాస్టార్ బ్లాక్బ‌స్ట‌ర్ రీ రిలీజ్‌...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అలాంటి వాటిలో హిట్లర్ సినిమా ఒకటి .. 1997 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల అయింది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రంభ హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ - దాసరి నారాయణరావు - రామిరెడ్డి కీలక పాత్రలలో నటించారు. 28 ఏళ్ల తర్వాత హిట్లర్ సినిమా ఉండడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఐదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా చిరు నటన హిట్లర్ సినిమాలో అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాకి కోటి అందించిన మ్యూజిక్ చాలా హిట్ అయింది. సీనియ‌ర్‌ నటుడు రచయిత ఎల్ బి శ్రీరామ్ ఈ సినిమాకు మాటలు రాశారు. 42 సెంటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది. చిరు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండి పోయాయి. ఈ సినిమా జనవరి 1న రిలీజ్ కానుంది. అంతొద్దు .. ఇది చాలు అన్న డైలాగ్ ఈ సినిమా నుంచి బాగా పాపుల‌ర్‌.

నడక కలిసిన నవరాత్రి అనే పాటకు చాలామంది అభిమానులు ఉన్నారు. అబీబీ అబీబీ అంటూ సాగే పాటకు చిరు ఎవర్ గ్రీన్‌ స్టెప్ వేశారు. యమలీల సినిమా హిట్ తో మంచి క్రేజ్ లో ఉన్న నటి ఇంద్రజకు చిరంజీవి ప్రక్కన నటించే అవకాశం వచ్చింది. ఆమె దానిని కాదనుకుంది. మొదట అల్లుడా మజాకా సినిమాలో చిరంజీవికి చెల్లిగా ఇంద్రజను అనుకున్నారు .. ఆమె నటించకపోవడంతో ఆ అవకాశం ఊహ కు దక్కించుకుంది. అలాగే హిట్లర్ సినిమాలో కూడా చిరు పక్కన మళ్ళీ చెల్లిగా నటించే అవకాశం వచ్చింది. అప్పుడు కూడా తనకు డేట్లు వీలుకాక పోవడంతో నో చెప్పింది .. అలా రెండుసార్లు చిరంజీవి ప్రాజెక్టులను ఆమె తిరస్కరించింది. చిరు చెల్లిగా నటిస్తే ఆయనతో డ్యాన్స్‌ చేసే అవకాశం ఉన్నదని భావించి ఆ సినిమాలను తాను తిరస్కరించాన‌ని .. తాను చిరంజీవికి అభిమానిని అని ఆయనతో కలిసి ఒక పార్ట్ కు అయినా డ్యాన్స్ చేయాలన్నదే తన కోరిక అని ఆమె పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: