పులివెందులలో జగన్ మెజారిటీ తగ్గడానికి కారణాలివేనా.. మాజీ సీఎంకు అదే మైనస్!

Reddy P Rajasekhar
2019 సంవత్సరంలో ఊహించని ఫలితాలతో వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఏ పార్టీతో పొత్తు లేకుండానే వైసీపీ సాధించిన సంచలన ఫలితాలు ఆ పార్టీ అభిమానులకు సైతం ఆనందాన్ని కలిగించాయి. అయితే 2019లో సంచలన ఫలితాలను సాధించిన వైసీపీ 2024 సంవత్సరంలో మాత్రం ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో ఫెయిల్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
పులివెందులలో జగన్ మెజారిటీ తగ్గడానికి కారణాలు ఏంటనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్ సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా అడుగులు వేయడం ఆయనకు మైనస్ అయిందని చెప్పవచ్చు. మాజీ సీఎంకు ఇదే మైనస్ గా మారిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ కొంతమందిని గుడ్డిగా నమ్మి పొలిటికల్ కెరీర్ ను నాశనం చేసుకున్నారు.
 
వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా జగన్ గతంలో చేసిన తప్పులే ఆయనను నిండా ముంచేశాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు. జగన్ లో ఇప్పటికి కూడా మార్పు రాలేదని అందువల్లే వైసీపీ పరిస్థితి ఇలా ఉందనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.
 
జగన్ రాజకీయంగా సంచలనాలు సృష్టించాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరి జగన్ కు రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వస్తాయో రావో చూడాల్సి ఉంది. ఏపీలో కూటమి బలంగా ఉన్న నేపథ్యంలో ఈ పార్టీలకు గట్టి పోటీ ఇవ్వడం జగన్ కు సులువు కాదనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. జగన్ ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలతో ముందుకొస్తారో చూడాల్సి ఉంది. సొంత కుటుంబం సైతం దూరం పెట్టడం జగన్ కు శాపంగా మారిందనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. జగన్ కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మాత్రమే భవిష్యత్తులో విజయాలు సొంతమయ్యే ఛాన్స్ అయితే ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: