నందమూరి నటన సింహం బాలకృష్ణ ఈ మధ్యకాలంలో అద్భుతమైన జోష్లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే బాలకృష్ణ కొంత కాలం క్రితం అఖండ అనే మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి సినిమాలతో కూడా విజయాలను అందుకున్నాడు. ఇలా వరుసగా మూడు సినిమాలతో బాలయ్య మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ఈ మూడు సినిమాలు మ్యూజికల్ గా కూడా మంచి విజయాలను అందుకున్నాయి.
ఈ మూడు సినిమాలకు తమన్ సంగీతం అందించాడు. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ "డాకు మహారాజ్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే దాకు మహారాజ్ మూవీ కి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ఈ మూవీ సంగీతంపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా నుండి మేకర్స్ రెండు పాటలను విడుదల చేశారు. ఈ మూవీ నుండి మొదటగా ఈ మూవీ బృందం వారు రేజ్ ఆఫ్ డాకు అంటూ సాగే పాటను విడుదల చేశారు.
ఈ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో కేవలం 1.5 మిలియన్ వ్యూస్ , 70 వేల లైక్స్ మాత్రమే దక్కాయి. ఇక తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి చిన్ని అంటూ సాగే మరో సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ కి 24 గంటల్లో 1.3 మిలియన్ వ్యూస్ , 58 లైక్స్ మాత్రమే దక్కాయి. ఇలా ఈ మూవీ నుండి విడుదల అయిన రెండు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి పెద్ద స్థాయిలో 24 గంటల్లో రెస్పాన్స్ దక్కలేదు.