
టివి: షోలోనే.. ప్రియాంక జైన్ కీ బ్రేకప్ చెప్పిన ప్రియుడు..!
ఇక ప్రియాంక జైన్, ప్రియుడు శివకుమార్ ఏకంగా షర్టు విప్పేసి మరి తేజస్వినితో హద్దులు మీరి మరి రొమాన్స్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ షో కి గెస్ట్ గా హీరోయిన్ తమన్నా కూడా ఎంట్రీ ఇచ్చింది. అలా హీరోయిన్ తమన్నా కి ఒక ఫ్లవర్ తో ప్రపోజ్ చేయడం కూడా చూడవచ్చు. ఆ వెంటనే ప్రియాంక జైన్ గురించి స్టేజి పైన పలు రకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది శివ్ కుమార్. ముఖ్యంగా ప్రియాంక వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉండగానే తొక్కలో ప్రియాంక.. ఈ సీజన్ అయ్యే వరకు మళ్లీ బాయ్స్ టైటిల్ గెలిచే వరకు.. శివ్, ప్రియా బ్రేకప్ అంటూ ఒక బాంబు పేల్చారు.
అయితే దీంతో ప్రియాంక జైన్ ఈ ఇష్యూ ని పేరెంట్స్ దృష్టికి తీసుకు వెళ్తానంటూ శివకుమార్ కి సడన్ షాక్ ఇచ్చింది.. అయితే ఇదంతా కూడా టిఆర్పి రేటింగ్ కోసమే చేశారా అనడానికి అక్కడ వారు ఇచ్చిన ఎక్స్ప్రెస్ బట్టి కనుక్కోవచ్చు అంటూ పలువురు నెటిజన్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందుకు సంబంధించి పూర్తిగా తెలియాలి అంటే మరో కొన్ని గంటలు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ విషయమైతే ఇప్పుడు వైరల్ అవుతోంది.