ఏపీ: భవిష్యత్తు రాజకీయాల్లో చాప కింద నీరులా బీజేపీ మారనుందా.?

FARMANULLA SHAIK
ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ఏడాది 2024 మే13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 25 లోక్‌సభ సీట్లతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 6 లోక్ సభ సీట్లతో పాటు 10 స్థానాల్లో కూటమి తరుపున బరిలో దిగింది.అయితే ఎప్పుడు ఊహించని విధంగా కూటమి ఈ ఎన్నికల్లో ఏకంగా 164 స్థానాలలో గెలిచి సునామీ సృష్టించింది. వైనాట్ 175 అంటూ విర్రవీగిన వైఎస్సార్సీపీని చిత్తు చిత్తుగా ఓడించింది.సింహం సింగిల్‌గా వస్తుందంటూ సవాళ్లు చేసిన జగన్‌కు, ఆయన పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గల్లంతు చేశారు.అయితే కూటమిలో భాగం ఐనా బీజేపీకు ఈ ఎన్నికల్లో ఒక లక్కీ నెంబర్ యాదృశ్చికంగా ఏర్పాటైంది అనే చెప్పాలి.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఏపీ, తెలంగాణలో బీజేపీ లక్కీ నెంబర్ 8 ఏమో అనిపిస్తుంది.ఎందుకంటే గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలైనా ప్రస్తుతం ఏపీ శాసనసభ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్ల సంఖ్య 8. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ప్రస్తుతం తెలంగాణలో లోక్‌సభలో 17 స్థానాల్లో పోటీచేయగా బీజేపీ 8చోట్ల గెలిచింది. మరోవైపు ఏపీ అసెంబ్లీలో 10 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయగా 8 చోట్ల విజయం సాధించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ లక్కీ నెంబర్ 8 అంటూ సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.రెండు తెలుగు రాస్ట్రాల్లో బీజేపీ ఇలాంటి అద్భుత విజయం సాధించడంలో నరేంద్ర మోదీ రోడ్ షో కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఈ ఎన్నికలు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో కీలక పట్టుగా మారాయి. ఇప్పటిదాకా అసలు ఉనికే లేని బీజేపీకు ఒక గుర్తింపు తెచ్చి పెట్టాయి అనడంలో ఆశ్చర్యం లేదు.దీన్ని బట్టి ఇకపై రాబోయే జరగబోయే ఎన్నికల్లో బీజేపీ చాప కింద నీరులా మరీ ప్రధాన పార్టీలను సైతం టెన్షన్ పెట్టే విధంగా వ్యూహాలు పన్నడంలో ఆశ్చర్యం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: