సీఎం రేవంత్ రెడ్డితో..సినీ సెలబ్రిటీలు బేటి..సర్వత్ర ఉత్కంఠ..!
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఘటన తర్వాత తెలంగాణ సర్కార్ కి ,తెలుగు సినీ పరిశ్రమకు మధ్య కాస్త గ్యాప్ వచ్చిందనే విధంగా ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తే మనకి అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే సినీ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తాము కాని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే మాత్రం ఊరుకునేది లేదు అంటూ తెలంగాణ ప్రభుత్వం. దీంతో పాటుగా స్పెషల్ షోలు టికెట్ల రేట్లు పెంపు వంటివి కూడా ఉండవని తేల్చేశారు. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీకి కష్టాలు మొదలయ్యాయి. సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు కొన్ని వందల కోట్ల రూపాయల సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకొని సినీ పెద్దలందరూ కలవబోతున్నారట.
టాలీవుడ్ కు తెలంగాణ సర్కార్ కు వారధిగా దిల్ రాజు ప్రస్తుతం వ్యవహరిస్తూ ఉన్నారు. మరి దిల్ రాజు ఆయన టీమ్ రంగంలోకి దిగి తెలంగాణ సీఎంని ఎలా కన్విన్ చేస్తారు.. అలాగే ఈరోజు మంత్రితో కూడా భేటీ కాబోతున్నారట. ఇందులో కీలకమైన సమావేశం తో పాటుగా భవిష్యత్తులో ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మధ్య ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండకూడదనే విషయంపై దిల్ రాజు చర్చించబోతున్నట్లు సమాచారం. FDC చైర్మన్గా దిల్ రాజు తన టీమ్ తో ఈరోజు వెళ్లబోతూ ఉండడంతో అందరూ తెలంగాణ సీఎం ఏం స్పందిస్తారనే విషయంపై.. చాలా ఎక్సైటింగ్గా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.