గ్యాస్ ట్రబుల్ వేదిస్తోందా.. అయితే ఇలా చేయండి?

praveen
నేటి ఆధునిక యుగంలో మనిషి జీవన శైలిలో ఎంతలా మార్పులు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు తినే ఆహారం దగ్గర నుంచి చేసే పని వరకు అన్ని విషయాల్లో కూడా మార్పు వచ్చేస్తుంది. టెక్నాలజీ మీద బాగా ఆధారపడిపోతున్న మనిషి ప్రతి పనిని కూడా ఎంతో సులభతరం చేసుకునేందుకు ఇష్టపడుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. దీంతో చెమట చుక్క చిందించకుండానే అన్ని పనులను కూడా పూర్తి చేయగలుగుతున్నాడు.

 అదే సమయంలో ఇక ఇంట్లో ఉండే పౌష్టికాహారాన్ని తినడం మానేసి హోటళ్లలో మసాలాలు దట్టించిన ఆహారం తినడానికి.. ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.. అయితే ఇలాంటి ఆహారపు అలవాట్లు ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫుడ్ తినడం కారణంగా గ్యాస్ట్రిక్ సమస్యలతో ఎంతోమంది బాధపడుతున్నారు అన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఇలా గ్యాస్ ట్రబుల్ సమస్యను ఎలా దూరం చేసుకోవాలో తెలియక అందరూ తెగ ఇబ్బంది పడిపోతున్నారు.

 గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడుతున్న వారు దాని నుంచి ఉపశమనం పొందడానికి వైద్యులు ఇస్తున్న సూచనలు ఇవే.
 తిన్న కాసేపటికి వాకింగ్ లాంటి తేలికపాటి ఎక్సర్సైజులు చేయడం మంచిదట. యోగా చేయడం ద్వారా కూడా ఉపశమనం ఉంటుందట. కడుపు నిమరడం, బొజ్జకు వేడి కాపడం, ఆహారంలో ఆయుర్వేద మూలికలు వాడటం చేయాలంట. కొత్తిమీర వాము పార్స్లీ ఆకులు వాడటం..  చేమంతి అల్లం టీ తీసుకోవడం లాంటివి చేస్తే ఎంతో మంచిదట  అంతేకాకుండా ఫైబర్తో కూడిన ఆహారం తీసుకుంటే గ్యాస్ ట్రిక్ సమస్య దూరమవుతుందట అయితే ఇలా గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్న వారు ఇక చూయింగమ్ అసలు నమలవద్దు అంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతేకాకుండా తింటూ మాట్లాడొద్దని ఆహారాన్ని మెత్తగా నమాలాలని సూచిస్తున్నారు. కూల్డ్రింక్స్ తాగడం స్మోకింగ్ చేయడం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: