కరోనా బాధితులకు నరాల సంబంధిత సమస్యలు.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు?

praveen
కరోనా వైరస్.. ఈ పేరు చెప్తే చాలు ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఈ మహమ్మారి వైరస్ సృష్టించిన  మారణ హోమం అలాంటిది. కేవలం ఒక్క దేశంలోనే కాదు ప్రపంచ దేశాలను సైతం వనికించిన వైరస్ కరోనా. ఏకంగా కోట్లాదిమంది ప్రాణాలను తీసేసిన వైరస్ కరోనా. ఇక ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేలా చేసిన వైరస్ కరోనా. అంతేకాదు ఇక ఎంతోమంది జీవనోపాధి కోల్పోయి తినడానికి కూడా తిండి లేక పస్తులు ఉండే పరిస్థితిని తీసుకువచ్చింది ఈ మహమ్మారి వైరస్.

 ఏకంగా ప్రపంచం మొత్తం కనిపించని శత్రువుతో పోరాడి చివరికి విజయం సాధించింది. అయితే విజయం సాధించాము అని సంతోష పడేలోపే ఇక సరికొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణభయాన్ని కలిగిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఏకంగా ఇక వ్యాక్సిన్ వేసుకొని ఈ మహమ్మారి వైరస్ పై పోరాటానికి ప్రపంచం మొత్తం సిద్ధమైనప్పటికీ.. ఇంకా ప్రతి ఒక్కరిని భయపెట్టే రీతిలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఎంతో మంది కరోనా వైరస్ బారిన పడి మనోధైర్యంతో పోరాడి కోలుకున్నారు  కానీ ఇలా కరోనా వైరస్ బారి నుండి బయటపడిన తర్వాత కూడా ఇంకా ఈ వైరస్ ప్రభావం ప్రతి ఒక్కరిపై కూడా ఏదో విధంగా చూపుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే కరోనా వైరస్ కు సంబంధించి ఏదో ఒక విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. అయితే దీర్ఘకాల కరోనా బాధితుల్లో నరాల సంబంధిత వ్యాధులు వస్తున్నట్లు ఒక పరిశోధనలో వెళ్లడైంది అని చెప్పాలి. ఏకంగా బాధితులు ఒత్తిడి ఆందోళనతో పాటు ఇతర మానసిక సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు అన్న విషయాన్ని డెన్మార్క్ కు చెందిన కోపెన్ హెగెన్ వెర్సిటీ పరిశోధకులు గుర్తించారు. కరోనా వైరస్ బారిన పడిన దీర్ఘకాధిక బాధితుల్లో మెదడు పనితీరులో చాలా తేడా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ఏకంగా 345 మందిపై ఏడాది పాటు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: